Shani Dev: కుంభంలో ఇనుప పాదాలపై నడుస్తున్న శని... ఈరాశులకు ఊహించనంత మనీ..

Shani Dev: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం ఇనుప కాళ్లపై నడవడం వల్ల మూడు రాశుల వారు ఊహించనంత ధనాన్ని పొందుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 01:34 PM IST
Shani Dev: కుంభంలో ఇనుప పాదాలపై నడుస్తున్న శని... ఈరాశులకు ఊహించనంత మనీ..

Shani Dev transit 2023: గ్రహాల గమనంలో మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కర్మను ప్రసాదించే శనిదేవుడు జనవరి 17న త్రికోణ స్థితిలో కుంభరాశిలో సంచరించాడు. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శనిదేవుడు తన పాదాన్ని మార్చాడు. ఇప్పటి వరకు బంగారం, వెండి మరియు రాగి పాదాలపై నడిచిన శనిదేవుడు.. ప్రస్తుతం ఇనుప పాదాలపై నడవడం ప్రారంభించాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారు అద్బుతమైన ప్రయోజనాలు పొందనున్నారు. 

వృశ్చిక రాశి
శనిదేవుడు ఇనుప పాదాలపై నడవడం ప్రారంభించడం వల్ల శష్ అనే రాజయోగం ఏర్పడింది. దీంతో మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. 
కర్కాటక రాశి
శనిదేవుడు ఇనుప పాదాలతో ఈ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో మీరు శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీరు పాతపెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.
మీనరాశి
శని యొక్క సంచారం ఈ రాశికి చెందిన వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభించింది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. జాబ్ మారాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. అయితే శని సడేసతి కారణంగా మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. 

Also Read: Sun Transit 2023: మరో 5 రోజుల్లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News