Shani Dev Saturday Remedies: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని క్రూర గ్రహంగా, పాపపు గ్రహంగా పరిగణిస్తారు. శనిదేవుడు కోపానికి గురైన వ్యక్తి జీవితం సర్వనాశనమవుతుంది. అందుకే హిందూమతంలో శనిదేవుడికి మానవులే కాదు దేవతలు కూడా వణికిపోతారు.
శని బాధలను నివారించడానికి మరియు తగ్గించడానికి జ్యోతిష్యశాస్త్రంలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. ఇందులో ఒకదాని గురించి బ్రహ్మదేవుడు ముని పిప్పలాదుకి చెప్పినట్లు భవిష్యపురాణంలో చెప్పబడింది. గ్రహాల కోపాన్ని పూజలు మరియు పరిహారాలతో శాంతింపజేయమని బ్రహ్మ ముునికి చెప్పాడు. గ్రహ బాధల నుండి విముక్తి పొందేందుకు ఉపవాసం, భోగ్, హవన, నమస్కారం మొదలైనవాటిని ఆచరించాలని బ్రహ్మా... ముని పిప్పలాదుకి సూచించినట్లు భవిష్య పురాణంలో పేర్కొనబడింది.
శని (Shani Dev) బాధలు తొలగిపోవాలంటే బ్రాహ్మణులు శనివారం నాడు తమ శరీరానికి నూనె రాసుకోవాలి. అంతేకాకుండా ఇనుప పాత్రలో నూనె నింపి దానిని దానం చేయాలి. అంతేకాకుండా శని విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యం పూజించాలి. ఈ పరిహారం ఏడాదిపాటు చేయాలి.
దీని తర్వాత నల్ల పువ్వులు, నల్ల బట్టలు, నల్ల నువ్వులు, కాసర్, బియ్యం మొదలైన వాటిని పేదవారికి లేదా ఏదైనా బ్రాహ్మణునికి దానం చేయండి. ''‘శం నో దేవీరభీష్టయా అపో భవన్తు పితయే.శం యోరభి స్త్రవంతు న:.’'' అనే మంత్రాన్ని శనివారం పఠించడం వల్ల ప్రయోజనం పొందుతారు.
Also Read: Shani Dev: శనివారం ఉదయం ఈ పని చేస్తే అన్ని శుభప్రదాలే.. మీ అదృష్టం మారుపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook