Shani Dev Margi: మకరరాశిలో శని మార్గి... అక్టోబరు 23 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!

Shani Dev Margi:  శనిదేవుడు కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. శనిదేవుడు అక్టోబర్ 23 నుండి మకరరాశిలో సంచరించనున్నాడు. ఇది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2022, 10:21 AM IST
Shani Dev Margi: మకరరాశిలో శని మార్గి... అక్టోబరు 23 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!

Shani Dev Margi 2022: మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని కర్మ దేవుడు అని కూడా అంటారు. శనిదేవుడి రాశిమార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమన దిశలో (Shani Retrograde in Capricorn 2022) ఉన్నాడు. అతను అక్టోబరు 23న మకరరాశిలో మార్గంలో (Shani Dev Margi) ఉంటాడు. ఆ రాశిలోనే 17 జనవరి 2023 వరకు ఉంటాడు. ఈ శని మార్గి కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries): శని దేవుడి మార్గం మేష రాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. వీరు షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీ పని ప్రశంసించబడుతుంది. 
కర్కాటక రాశి (Cancer): ఈ రాశివారు ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు మెుండుగా ఉంటాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. పాత పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి. మంచి పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
ధనుస్సు రాశి (Sagittarius): శని మార్గి కారణంగా ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టులకు సంబంధించి విజయం సాధిస్తారు.

Also Read: Surya Grah Remedies: జాతకంలో సూర్యుడు బలపడాలంటే... ఆదివారం ఇలా చేయండి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News