Shani Asta 2023: ఆస్ట్రాలజీలో శని దేవుడిని క్రూరమైన గ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. మెుదట ఈ నెల 17న శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం జనవరి 30న మధ్యాహ్నం 12.06 గంటలకు అతడు అదే రాశిలో అస్తమించనున్నాడు.
శనిదేవుడు అస్తమించడం (Shani Dev Asta 2023) వల్ల సింహ, వృశ్చిక, కర్కాటక రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి. వీరు వ్యాపార మరియు వృత్తిలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఫ్యామిలీలో ఇబ్బందులు తలెత్తుతాయి. ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. శనిదేవునికి సంబంధించిన అనేక పరిహారాలు జ్యోతిష్యంలో చెప్పబడ్డాయి. ఈ చర్యలు చేయడం ద్వారా మీరు శని మహాదశ నుండి విముక్తి పొందుతారు.
ఈ పరిహారాలు చేయండి
>> శనివారం ఉపవాసం ఉండి శని దేవుడిని పూజించండి.
>> 'ఓం ప్రాణ్ ప్రాణ్ ప్రాణ్ శ: శనైశ్చరాయ నమః'.అనే శని మంత్రాన్ని జపించండి.
>> శనివారం నల్ల వస్తువులను దానం చేయండి.
>> శనివారం నాడు కుక్కను అవమానించకండి.
>> హునుమాన్ ను ఆరాధించి... సుందరకాండను పఠించండి.
>> పేదలకు దానం లేదా సహాయం చేయండి.
Also Read: Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలోకి బృహస్పతి.. ఈ రాశుల ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Shani Dev: ఈ పనులతో శనిదేవుడిని ప్రసన్నం చేసుకోండి, లేకపోతే మీకు కష్టాలు తప్పవు!