Shani Amavasya: చెడు ప్రభావం తగ్గాలంటే శని అమావాస్య రోజున పాటించాల్సిన విషయాలివే

Ways to Make Shani Dev Happy: ప్రతినెలా కృష్ణపక్షం చివరి రోజు అమావాస్య  వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఇదే విధంగా మార్చి 13న ఈ కృష్ణపక్షం అమావాస్య. దీనిని ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 12, 2021, 01:40 PM IST
Shani Amavasya: చెడు ప్రభావం తగ్గాలంటే శని అమావాస్య రోజున పాటించాల్సిన విషయాలివే

Shani Amavasya: Ways to Make Lord Shani Happy: హిందువులు విశ్వసించే పంచాంగం(Panchang)  ప్రకారం, ప్రతినెలా కృష్ణపక్షం చివరి రోజు అమావాస్య  వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఇదే విధంగా మార్చి 13న ఈ కృష్ణపక్షం అమావాస్య. దీనిని ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు. రేపటి రోజును శని అమావాస్య (Shani Amavasya) అని కూడా అంటారు. ఏది ఏమైనా హిందూ మతంలో అమావాస్యకు ప్రాముఖ్యత ఉంది. 

పితృ దోషాల నివారణ కోసం కొన్ని వస్తువులు, పదార్థాలు దానం చేస్తుంటారు. మరియు ఈ రోజు నదులలో పవిత్ర స్నానం చేసి, అవసరమైనవారికి దానం చేస్తే పితృ దోషాలు (Pitra Dosh)ను పరిష్కరించుకుంటారు. అమావాస్య శనివారం పడితే, దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం శనివారం రోజు ఏర్పడుతున్న అమావాస్యకు చాలా ప్రాధాన్యాత సంతరించుకుంది.

Also Read: Maha Shivratri 2021: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

శని అమావాస్య రోజు చతుర్గ్రాహి..
జ్యోతిష్కుల ప్రకారం, శిని అమావాస్య రోజు మార్చి 13న, నాలుగు గ్రహాల ప్రత్యేక కూటమి ఏర్పడుతోంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు మరియు శుక్రుడు కలిసి కుంభరాశిలో ప్రవేశిస్తారు. మరియు కుంభ రాశి శని యొక్క సంకేతం. శని యొక్క సంకేతంలోనే తిరోగమన యోగం ఏర్పడుతుంది. సాధారణంగా అమావాస్యరోజున దేవ కార్యాలు మరియు పితృ దేవతల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఈ అమావాస్య దర్శ అమావాస్య(Darsh Amavasya) కిందకి వస్తుంది.

శని అమావాస్య యొక్క ప్రాముఖ్యత
హిందూ మత విశ్వాసాల ప్రకారం శని అమావాస్య రోజున పితృ దేవతల (Pitra Shanti) శాంతి కోసం తర్పణాలు వదులుతారు. పితృ దేవతల దోషాలు నివారణ కోసం కొందరు శ్రాద్ధ కర్మలు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని అమావాస్య రోజున శని సాడేసాతి మరియు శని చెడు ప్రభావాలను నివారించడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. రేపు అమావాస్య  కనుక, ముందు రోజున ఉపవాసం ఉండటం మరియు పూజించడం ద్వారా చంద్రుడు శుభాలు కలుగచేస్తాడని మరియు అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజు పరమ శివుడికి ఏమేం సమర్పించాలి, వేటితో అభిషేకం చేయాలో తెలుసా

దీపం వెలిగించడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం.. 
-  శని అమావాస్య ఉదయం, నెయ్యితో దీపం వెలిగించాలి. సూర్య భగవానుడి 12 పేర్లను జపించాలి. సూర్య చాలీసాను పఠించాలి.
-  శని అమావాస్య రోజున, రావిచెట్టును ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయని భావిస్తారు. అందువల్ల, శని దేవుడి చెడు ప్రభావాలను నివారించడానికి ఆరోజు రావిచెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి.
- శని దేవుడికి జమ్మి చెట్టు అంటే చాలా ఇష్టం అని నమ్ముతారు, కనుక శని అమావాస్య రోజు సాయంత్రం జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్నది భక్తుల విశ్వాసంపై ఆధారపడిన సాధారణ సమాచారం. జీ న్యూస్ వీటిని నిర్ధారించదు. వాటిని మీరు పాటించాలంటే జ్యోతిష నిపుణులు, పూజారులను సంప్రదించండి)

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News