Shani Rashi Parivartan 2022: మరో 5 రోజుల్లో శని గ్రహం తన రాశిని మార్చబోతుంది. ప్రస్తుతం కుంభ రాశిలో తిరోగమనంలో ఉన్న శని.. జూలై 12న మకరరాశిలోకి (Saturn transit in Capricron 2022) ప్రవేశించనుంది. దీని ప్రభావం 6 రాశులపై ఉండనుంది. దీని ప్రభావం 3 రాశులవారికి అనుకూలంగా, మరో మూడు రాశులవారికి ప్రతికూలంగా ఉండనుంది. శని సంచారం వల్ల ఏ రాశులవారికి లాభం, ఏ రాశులవారికి నష్టమో తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభం
మీనం (Pisces) - మకరరాశిలో తిరోగమన శని ప్రవేశం మీన రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. వీరికి అన్నిరకాలుగా డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందవచ్చు. ఇది పెట్టుబడికి మంచి సమయం.
వృషభం (Taurus)- మకరరాశిలో తిరోగమన శని సంచారం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
ధనుస్సు (Sagittarius) - మకరరాశిలో శని సంచారం ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. వృత్తి-వ్యాపారాలలో లాభం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారస్థులకు భారీగా లాభాలు వస్తాయి. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది.
ఈ రాశులవారికి నష్టం
మిథునరాశి (Gemini)- తిరోగమన శని మకరరాశిలో ప్రవేశించడం మిథునరాశి వారికి ఇబ్బందులు కలిగిస్తుంది. వారు డబ్బును పొందుతారు కాని పెరిగిన ఖర్చులు వారిని పొదుపు చేయనివ్వవు. కుటుంబ జీవితంలో కూడా సమస్యలు ఉండవచ్చు.
తుల (Libra)- శని సంచారం తుల రాశి వారికి కష్టాలను ఇస్తుంది. వీరికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. పరీక్షలకు హాజరయ్యే వారు, ఇంటర్వ్యూకు వెళ్లేవారు చాలా కష్టపడాల్సి వస్తుంది.
కుంభం (Aquarius)- మకరరాశిలోకి శని ప్రవేశం వల్ల కుంభరాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఎవరితోనూ వాదించకండి, లేకుంటే అనవసరంగా దూరమవుతారు. బడ్జెట్ చూసి ఖర్చు పెట్టడం మంచిది.
Also read: Sun Transit 2022: కర్కాటక రాశిలో సూర్య సంచారం... ఈ 4 రాశుల వారికి అఖండ ఐశ్వర్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook