Saturday Remedies: శని యొక్క వక్ర దృష్టి జీవితాన్ని నాశనం చేస్తే, శని దేవుడి అనుగ్రహం జీవితాన్ని సకల సంతోషాలతో నింపుతుంది. అందుకే శనిదేవుని (Shani Dev) అనుగ్రహం కోసం ప్రజలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. శని మహాదశ, శని దోషం ఉన్నవారు శనివారం నాడు శని దేవుడిని పూజించి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే బాధల నుండి ఉపశమనం పొందుతారు.
శనివారం రాత్రి ఈ పరిహారం చేయండి
ఆర్థిక సంక్షోభం, ఉద్యోగ-వ్యాపారంలో అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు మొదలైన వాటిని అధిగమించడానికి శనివారం కింది చర్యలు చేపట్టడం ద్వారా కష్టాల నుండి గట్టెక్కవచ్చు.
>> శనివారం సాయంత్రం శని దేవాలయానికి వెళ్లి ఆవనూనె దీపం వెలిగించండి. నూనెలో కొన్ని నల్ల నువ్వులు వేయాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు.
>> శనివారం సూర్యాస్తమయం తర్వాత పీపుల్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం వల్ల జీవితంలోని అడ్డంకులు మరియు కష్టాలు తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని కొన్ని శనివారాలు నిరంతరం చేయడం వల్ల జీవితంలో స్పష్టమైన ప్రభావం కనిపిస్తుంది. వీలైతే నాలుగు ముఖాల దీపం వెలిగించండి.
>> శని దేవుడికి సుగంధ ద్రవ్యాలు చాలా ప్రీతికరమైనవి. శనివారం రాత్రి ఇంట్లో సుగంధ ద్రవ్యాలను కాల్చండి, ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. కుటుంబ సభ్యుల పురోభివృద్ధి బాటలు తెరుచుకుంటాయి, ఇంట్లో ధన ప్రవాహం పెరిగి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
>> శని దేవుడు కుక్కకు సేవ చేయడం ద్వారా సంతోషిస్తాడు. అందువల్ల శనివారం ఆవనూనెతో నల్ల కుక్క రొట్టె తినిపించండి. దీని వల్ల శని అనుగ్రహం లభించడమే కాకుండా జాతకంలో రాహు-కేతు దోషాలు ఉంటే అవి కూడా దూరమవుతాయి.
>> శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించడం కూడా గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది.
>> శనివారం సాయంత్రం పీపుల్ చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో ఇంట్లో ఐశ్వర్యానికి, కీర్తికి లోటు ఉండదు.
Also Read: Devshayani Ekadashi 2022: దేవశయని ఏకాదశి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook