Tirumala news: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో ఘోర అపచారం.. ఆందోళనలో శ్రీ వారి భక్తులు.. అసలేం జరిగిందంటే..?

Tirumala laddu controversy: తిరుమలలో పవిత్రమైన బ్రహ్మోత్సవాల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు తీవ్ర మనోవేదనకు గురౌతున్నట్లు తెలుస్తోంది.

1 /8

తిరుమలలో కల్తీ వివాదం దేశంలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఏపీ చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వు, చేపనూనెలు కలిపారంటూ.. గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా రచ్చగా మారింది.

2 /8

ఇదిలా  ఉండగా.. లడ్డుపై డిప్యూటీ సీఎం కూడా ప్రాయిశ్చిత దీక్ష సైతం చేపట్టారు. ఇదిలాగా తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో సైతం అనేక పిటిషన్ లు దాఖలయ్యాయి. దీనిపై గత గురువారం సుప్రీం.. ఏపీ  ప్రభుత్వానికి మొట్టికాయలు సైతం వేసింది. ఈ క్రమంలో ఏపీ సిట్ ను క్యాన్షిల్ చేసింది.

3 /8

మరోవైపు  తిరుపతిలో.. ప్రస్తుతం పవిత్రమైన సాలకట్ల బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తిరుమలకు సాయంత్రం చేరుకొన్నారు. ఇదిలా  ఉండగా.. పవిత్రమైన తిరుమల బ్రహ్మోత్సవాల వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

4 /8

తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు.. ధ్వజా రోహాణం చేపడతారు. దీనిపై అర్చకులు గరుడ పతాకాన్ని ఈ కొక్కెతో ఎగుర వేస్తారు. శ్రీవారికి గరుడు వాహానం గా చెప్తుంటారు. అలాంటి గరుడుడి పతాకాన్ని ఎగురవేసే పవిత్రమైన కొక్కె ఒక్కసారిగా విరిగిపోయింది.    

5 /8

కాసేపట్లో ఇదే కొక్కి ద్వారా గరుడ పతాకం ఎగుర వేసేందుకు ఏర్పాటు జరుగుతున్న వేళ ఈ ఘటన జరగటం పెను సంచలనంగా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

6 /8

తొమ్మిది రోజుల పాటు గరుడ పతాకాన్ని అక్కడ ధ్వజస్థంబంపై కొక్కెకు  ఉంచుతారు. అలాంటి పవిత్రమైన కొక్కెం విరిగి పోవడంపట్ల శ్రీవారి భక్తులు మాత్రం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

7 /8

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల వేళ ఇలాంటి ఘటన జరగటం మాత్రం దేశంలో వివాదంగా మారింది. మరోవైపు తిరుమల లడ్డూ వివాదంపై ఈరోజు  సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. దీనిపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కొత్త సిట్ ను ఏర్పాటు చేశారు.  

8 /8

కొత్త సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు.. రాష్ట్ర సర్కార్ నుంచి ఇద్దరు పోలీస్‌ అధికారులు.. సీనియర్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారితో స్వతంత్ర దర్యాప్తు చేయాలన్నారు. సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్ సూద్‌ పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు... కొత్త సిట్ బృందం.. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.