Devara 1st Week Box Office Collections: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. మొత్తంగా మిక్స్ డ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊర మాస్ ఊచకోత కోసింది.
రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేసాడు. ఈ సినిమాకు తొలి రోజు కొంత మంది పనికట్టుకొని నెగిటివ్ ప్రచారం చేసినా.. అవేవి బాక్సాఫీస్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. అంతేకాదు తొలిరోజే.. దాదాపు రూ. 170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఆంధ్రావాలా, శక్తి సినిమాల తర్వాత ‘దేవర’ మూవీలో మూడోసారి తండ్రి కొడుకులుగా మెప్పించారు. తండ్రీ కుమారులుగా చేసిన గత రెండు చిత్రాలు ఫ్లాపైనా.. ఆ సెంటిమెంట్స్ ను పట్టించుకోకుండా ఎన్టీఆర్ ఈ సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు.
మొత్తంగా ఆరు రోజుల్లో దాదాపు అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వారం రోజుల్లో ఈ సినిమా రూ. 405 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో రెండో రూ. 400 కోట్ల చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అంతేకాదు తెలంగాణ (నైజాం)లో ఈ మూవీ రూ. 50 కోట్ల షేర్ అందుకొని సంచలనం రేపింది.
మరోవైపు రాయలసీమలో దాదాపు రూ.23 కోట్ల ఊచకోత కోసింది. ఓవర్సీస్ లో దాదాపు $6 మిలియన్ యూఎస్ డాలర్స్ వైపు పరుగులు తీస్తుంది.
అంతేకాదు దేవర తొలి బ్రేక్ ఈవెన్ అందుకున్నది కూడా ఓవర్సీస్ గడ్డ మీద కావడం విశేషం. అక్కడ దాదాపు రూ. 35 కోట్ల షేర్ (రూ.70 కోట్ల ) గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో ఈ సినిమా మరిన్ని వసూళ్లను రాబట్టినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.