Swag Movie Review: ‘స్వాగ్’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..!

Swag Movie Review: శ్రీ విష్ణు  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’. గత కొన్నేళ్లుగా ఇతను వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్నాడు. తాజాగా ఇపుడు ‘స్వాగ్’ అనే మూవీతో పలకరించాడు. మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు మరో హిట్ అందుకున్నాడా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 4, 2024, 07:19 PM IST
Swag Movie Review: ‘స్వాగ్’ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..!

మూవీ రివ్యూ: స్వాగ్ (Swag)
నటీనటులు: శ్రీ విష్ణు, రితూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, గెటప్ శ్రీను, గోపరాజు రమణ, రవిబాబు తదితరులు
ఎడిటర్ : విప్లవ్ నైషధం
మ్యూజిక్: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం : హసిత్ గోలి

యూత్ హీరోగా శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘స్వాగ్’ హసిత్ గోలి డైరెక్ట్ చేసారు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

స్టోరీ విషయానికొస్తే..
ఈ సినిమా శ్వాగణిక వంశానికి చెందిన రాజ కుటుంబానికి చెందిన వారసత్వం నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. భవభూతి (శ్రీ విష్ణు)ఎస్సైగా పదవీ విరమణ చేస్తాడు. అయితే అతనికి రావాల్సిన పెన్షన్ బకాయిలు.. పీఎఫ్ రాకుండా ధనలక్ష్మీ అనే మహిళా అధికారిగా అడ్డుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో అతను శ్వాగణిక వంశంలో పుట్టిన వ్యక్తి అని తెలుసుకుంటాడు. వారసత్వంగా తనకు కోట్ల ఆస్తి దక్కే అవకాశాలున్నాయని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో భవభూతికి అనుభూతి (రీతూ వర్మ)తారస పడుతుంది. ఆమె దగ్గర అతని వంశానికి చెందిన రాగి పలక ఉంటుంది.

డబ్బులు రాలేదని బాధ పడుతున్న సమయంలో తాను శ్వాగణిక వంశంలో జన్మించిన వ్యక్తి అని తెలుసుకుంటాడు. వారసత్వంగా తనకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.వాళ్లిద్దరికి ఆస్తి రాకుండా చేసిన యయాతి (శ్రీవిష్ణు)ఎవరు.. ?   మొత్తంగా ఒకే రకంగా ఈ ముగ్గురు ఎందుకున్నారు. అసలు శ్వాగణిక వంశ పలక ఉన్న అనుభూతి ఎవరు.. ? మొత్తంగా భవభూతికి చిరకు తాను కోరుకున్న ఆస్తి దక్కిందా.. ? లేదా అనేదే ఈ మూవీ స్టోరీ.

కథనం, విశ్లేషణ

దర్శకుడు హసిత్ గోలి .. స్వాగ్ సినిమాను రొటీన్ స్టోరీగా కాకుండా.. మన సమాజంలో పురుషాధిక్యత , స్త్రీ సాధికారిత, పితృ స్వామ్యం,  మాతృస్వామ్యం గురించి చర్చించడం బాగుంది. మొత్తంగా లింగ భేదం లేకుండా అందరు ఒకటే అన్న సందేశం ఇచ్చాడు దర్శకుడు.
మొత్తంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడా సోది లేకుండా సూటిగా చెప్పాడు. సంభాషణాల్లో అతని ప్రతిభ కనిపించింది. తాను అనుకున్న కథను అక్కడక్కడ కన్ఫ్యూజన్ అయినా.. ఓవరాల్ గా ఈ సినిమాతో ఓ మంచి ప్రయత్నం చేసాడనే చెప్పాలి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.

ఇంటర్వెల్ వరకు ఏదో అలా సాగిపోతూ ఉంటుంది. మొత్తం కథను ఇంటర్వెల్ తర్వాతే రివీల్ చేసాడు. కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పీపుల్ మీడియా అధినేతగా టీజీ విశ్వప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించాడు. అది తెరపై కనిపించింది. తెలుగులో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా సత్తా చాటుతున్నారు. మొత్తంగా సినిమాను నిర్మించడంతో పాటు ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో అక్కడ ఖర్చు పెట్టే విషయంలో రాజీ పడటం లేదు. మొత్తంగా సినిమాను క్వాలిటీగా నిర్మించడంలో నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్ గట్స్ ఏంటో ‘స్వాగ్’ చూస్తూ తెలుస్తుంది. కథను నమ్మి ఖర్చు చేయడంలో ఆయన గట్స్ ఏంటో చూపించింది.

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

నటీనటుల విషయానికొస్తే..
శ్రీ విష్ణు తనదైన ఈజ్ తో నటించి మెప్పించాడు. కామెడీతో పాటు ఎమోషన్స్ ను మంచిగానే పండించాడు. మొత్తంగా తన కెరీర్ లో ఐదు క్యారెక్టర్స్ తో పాటు .. ఏడు లుక్కుల్లో కనిపించి మెస్మరైజ్ చేసాడు. ఓ రకంగా శ్రీ విష్ణుకు ఇది ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి. రీతూ వర్మ తన నటనతో ఆకట్టుకుంది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

స్వాగ్’.. అక్కడక్కడ మెప్పించే ‘శ్వాగణిక వంశ’ డ్రామా..

రేటింగ్: 3/5

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News