Ram Navami 2023: ఘనంగా అయోధ్యలో రామజన్మోత్సవ వేడుకలు.. మీరే చూడండి రాముడిని ఎలా అలంకరించారో!

Ram Navami 2023: రామజన్మోత్సవ వేడుకలు అయోధ్యలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించబోతునట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 07:20 PM IST
Ram Navami 2023: ఘనంగా అయోధ్యలో రామజన్మోత్సవ వేడుకలు.. మీరే చూడండి రాముడిని ఎలా అలంకరించారో!

Ram Navami 2023: రామ నవమిని హిందులవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా రాముడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో రాముడికి కళ్యాణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా రామ జన్మ భూమి ఆయోధ్యలోనైతే కన్నుల పండవగా వేడుకలు జరుగుతాయి. అయితే ప్రతి సంవత్సరం రామనవమి వేడుకలు మార్చి నెలలో వారం పాటు నిర్వహిస్తారు. ఇక ఈసారి అయోధ్యలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ నవమి మహోత్సవాన్ని ఈ రోజు నుంచి మార్చి 30 వరకు ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భజనతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. ఈ వేడుకలు తాత్కాలిక ఆలయంలో శ్రీరాముడి చివరి జన్మదిన వేడుకలని కూడా ట్రస్ట్ తెలిపింది. రాబోయే జన్మదిన వేడుకలు కొత్తగా నిర్మిస్తున్న మందిరంలో జరగనున్నాయి.

రామజన్మోత్సవ వేడుకలు అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న  వివిధ దేవాలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే ఇప్పటికే శ్రీరామున్ని ఉత్సవాల కోసం అందంగా అలంకరించిన ఫోటోలను ట్రస్ట్‌ విడుదల చేసింది. ఇప్పటికే భక్తులు ఆలయానికి భారీగా చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News