Rahu Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువు గ్రహాలను చెడు ప్రభావం కలిగిన వాటిగా సూచిస్తారు. ఈ గ్రహాలు జాతకంలో ప్రతికూల స్థానంలో ఉంటే వ్యక్తగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. జన్మరాశిలో రాహువు స్థానం అననుకూలంగా ఉండి..ఈ గ్రహం శత్రు రాశులలో ఉంటే వ్యక్తుల జీవితాలపై అననుకూల ప్రభావాలను చూపుతుంది. గత సంవత్సరం 12వ తేది ఏప్రిల్‌లో రాహువు మేషరాశిలో సంచారం చేశాడు. ఇప్పుడు కదులుతూ అక్టోబర్ 30న రాహు సంచారం మీనరాశిలోకి సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితంలో కష్టాలతో పాటు నష్టాలు కూడా మొదలవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై రాహు ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి:
రాహు రాశి సంచారం జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. రాహువు అక్టోబర్ 30వ తేదిన మేషరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా మేష రాశివారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. ఇక వ్యాపారాలు చేసేవారు కచ్చితంగా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎప్పుడు ఊహించని స్థాయిలో నష్టపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు ఏకకాలంలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. లేకపోతు పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
వృషభ రాశి:
మేషరాశి నుంచి రాహువు మీన రాశిలోకి సంచారం చేయడం కారణంగా వృషభ రాశివారి జీవితంలో ఒక్కసారిగా మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు పెరగడం కారణంగా డబ్బుకు కోరతగా ఉండవచ్చు. కాబట్టి ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకపోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న చిన్న గొడవలు వస్తాయి. వీటిని తొందరగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సామాజంలో పని చేస్తున్నవారికి ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి.
మకర రాశి:
మకర రాశికి కూడా రాహువు సంచారం కారణంగా అనేక రకాల సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో వివాదాలు పెరగడం కారణంగా పిల్లలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరికి ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి పని ప్రదేశంలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు చేసేవారి నష్టాలతో పాటు చిన్న చిన్న లాభాలు వస్తాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సవాళ్లు జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి