Planet Transits May 2023 in Telugu: ఆస్ట్రాలజీ ప్రకారం, మే నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. వచ్చే నెలలో శుక్రుడు, బుధుడు, అంగారకుడు మరియు సూర్యుడు తమ రాశులను ఛేంజ్ చేయనున్నారు. మే నెల ప్రారంభంలో శుక్రుడు వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. మే 10న కుజుడు కర్కాటక రాశిలోకి, 15న సూర్యుడు వృషభరాశిలోకి ఎంటర్ అవుతారు. ఈ గ్రహాల సంచారం కారణంగా కొందరి జాతకాలు మారిపోనున్నాయి. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం.
మిథునం: ఈ రాశి వారికి మే నెల శుభప్రదంగా ఉంటుంది. వీరు కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. తద్వారా ఆర్థికపరిస్థితి బలపడుతుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి మే నెల సూపర్ గా ఉండబోతుంది. మీరు కెరీర్‌లో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. బిజినెస్ బాగా సాగుతుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
సింహ రాశి: మే నెల సింహ రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది. బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.
Also Read: Shani Retrograde 2023: కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్న శని.. ఈ రాశులకు మనీ మనీ మోర్ మనీ..
మకరం: వచ్చే నెలలో జరిగే గ్రహ గోచారాలు మకర రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆఫీసులో మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. డబ్బును ఆదా చేస్తారు.
మీనం: మేలో గ్రహాల సంచారం మీన రాశి వారికి కెరీర్‌ను దూసుకుపోయేలా చేస్తుంది. వీరు పరీక్ష-ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం డబల్ అవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
Also Read: Mangal Gochar 2023: మే 10న కీలక పరిణామం.. ఈ 6 రాశులపై 45రోజులపాటు డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook