Planet Changes 2022: డిసెంబరులో 3 పెద్ద గ్రహాల సంచారం.. ఈ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Planet transits 2022:  డిసెంబర్ నెలలో మూడు ప్రధాన గ్రహాల సంచారం జరగనుంది. దీంతో మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 12:34 PM IST
  • వచ్చే నెలలో బుధ, శుక్ర మరియు సూర్య గ్రహాల సంచారం
  • ఈ మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి.
  • ఇందులో మీరున్నారా మరి.
Planet Changes 2022: డిసెంబరులో 3 పెద్ద గ్రహాల సంచారం.. ఈ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Planet Changes In December 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తనరాశిని మారుస్తోంది. డిసెంబరులో కొన్ని ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. ఈనెలలో బుధుడు, శుక్రుడు మరియు సూర్య గ్రహాలు తమ రాశులను ఛేంజ్ (Planet Changes 2022) చేయనున్నాయి. డిసెంబర్ నెలలో ఈ మూడు ప్రధాన గ్రహాల సంచారం వల్ల ఏరాశులవారు ఇబ్బంది పడనున్నారో తెలుసుకుందాం.  

మేషరాశి(Aries): మేష రాశి వారికి డిసెంబర్ నెల కొంత బాధను కలిగిస్తుంది, ఈ నెలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు నష్టాలు కలిగిస్తుంది. 

వృషభ రాశి (Taurus): డిసెంబరులో మూడు గ్రహాల రాశి మారడం వల్ల వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాల్లో చిక్కుకుంటారు. ఈ సమయంలో బిజినెస్ లో పెట్టుబడి పెట్డడం మానుకోండి. మీరు ఇల్లు లేదా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే దానికి దూరంగా ఉండండి. కుటుంబంలో సమస్యలు వస్తాయి. 

కన్య రాశి(Virgo): కన్యా రాశి వారికి బుధుడు అధిపతి. డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు రావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వివాదాలు రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది. 

Also read: Mercury Remedies: బుధుడు బలహీనంగా ఉన్నా ఫరవాలేదు..ఇవి పాటిస్తే ఇక మీకు తిరుగుండదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News