Navratri 2022: తొమ్మది రోజులు పాటు అమ్మవారికి ఇలా నైవేద్యాలు సమర్పించి.. విజయదశమి రోజు ఇలా చేయండి.

Navratri 2022: హిందూ భక్తులకు దేవి నవరాత్రలు ఎంతో ప్రముఖ్యమైనవి. తొమ్మది రోజుల పాటు కొనసాగే నవరాత్రుల్లో భక్తులంతా దుర్గదేవిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2022, 11:49 AM IST
Navratri 2022: తొమ్మది రోజులు పాటు అమ్మవారికి ఇలా నైవేద్యాలు సమర్పించి.. విజయదశమి రోజు ఇలా చేయండి.

Navratri 2022: హిందూ భక్తులకు దేవి నవరాత్రలు ఎంతో ప్రముఖ్యమైనవి. తొమ్మది రోజుల పాటు కొనసాగే నవరాత్రుల్లో భక్తులంతా దుర్గదేవిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. నవరాత్రల్లో భాగంగా దుర్గా దేవికి వివిధ రకాల నైవేద్యాలు సమరిస్తారు. ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పూజలు చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు లభిస్తాయని శాస్త్రం పేర్కొంది. ఈ తొమ్మది రోజులు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే.. దేవి అనుగ్రహం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..

మొదటి రోజు:
నవరాత్రి 26 సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి రోజున ఘటస్థాపనతో  శైలపుత్రి తల్లిని పూజిస్తారు. ఈ రోజున ఆవు నెయ్యితో చేసిన తీపి పదార్ధాలను తల్లికి సమర్పించాలి. ఇది అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది.

రెండవ రోజు:
 రెండవ రోజు  తల్లి బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తుంది. అయితే ఈ రోజూ అమ్మవారి  నైవేద్యాలగా పంచామృతాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దుర్గ దేవి అనుగ్రహం లభించడమేకాకుండా సిరులు, సంపదలు  కలుగుతాయి.

3వ రోజు:
మూడవ రోజూ అమ్మవారు చంద్రఘంటా దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనుంది. అయితే ఈ రోజూ అమ్మవారిని దర్శించుకుంటే మానసిక, శారీరక, ఆర్థిక సమస్యల దూరమవుతాయని శాస్త్రం చెబుతోంది. చంద్రఘంటా దేవికి పాలతో చేసిన తీపిని నైవేద్యంగా సమర్పించాలి.

నాల్గవ రోజు:
నాల్గవ రోజు తల్లి కూష్మాండ రూపంలో దర్శనమిస్తుంది. ఈ తల్లిని దర్శించుకోవడం వల్ల  తెలివితేటలు పెరిగి నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి 4వ రోజూ తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి. అయితే ఈ రోజూ నైవేద్యంగా తీపి పదార్ధాలు సమర్పించండి.

ఐదవ రోజు:
దుర్గా దేవి ఐదవ రోజూ స్కందమాతగా దర్శనమివ్వనున్నారు. అమ్మవారికి అరటిపండు నైవేద్యాన్ని సమర్పించడం వల్ల  వ్యాధుల నుంచి విముక్తి లభించి శరీరం సమస్యలు దూరమవుతాయి.

6వ రోజు:
ఆరవ రోజు కాత్యాయని రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శంచుకుంటే సుఖ సంతోషాలు చేకూరుతాయి. కాత్యాయని అమ్మవారికి తేనెతో చేసిన ఆహారాలను నైవేద్యంగా ఇవ్వాలి.

ఏడవ రోజు:
ఏడవ రోజు అమ్మ కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే పూజలో భాగంగా  బెల్లంతో చేసిన వస్తువులను సమర్పిస్తే మంచి ఫలితాలు పొందుతారు. శత్రువులను జయించే వరం కూడా లభిస్తుంది.

ఎనిమిదవ రోజు:
ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరి అవతారంలో దర్శనమిస్తుంది. పూజలో భాగంగా మహాగౌరికి కొబ్బరికాయను సమర్పించాలి. ఇలా చేస్తే భౌతిక ఆనందాన్ని పొందుతారని శాస్త్రం చెబుతోంది.

తొమ్మిదవ రోజు:
చివరి రోజనైనా సిద్ధిదాత్రి అమ్మవారుగా దర్శనమిస్తారు. అమ్మవారికి చివరి రోజూ ఖీర్, పూరీ, హల్వా నైవేద్యంగా పెట్టి 9 మంది ఆడపిల్లలకు పూజ చేసి తినిపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సకల శుభలు కలుగుతాయి.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News