Navpancham Rajyog 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు ఒక పర్టికలర్ టైం తర్వాత తమ కదలికలను మార్చుకుంటాయి. ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికను మైత్రి లేదా సంయోగం అంటారు. ఈ గ్రహాల మైత్రి రాజయోగాలను ఏర్పరుస్తాయి. సుమారు 300 ఏళ్ల తర్వాత ఇలాంటి ఓ రాజయోగం ఏర్పుడుతుంది. మార్చి 13న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. శనిదేవుడు కూడా అదే రాశిలో కూర్చుని ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన 'నవపంచం రాజయోగం' ఏర్పడింది. ఈ పవిత్రమైన యోగం వల్ల నాలుగు రాశులవారిపై కనకవర్షం కురవనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మిధునరాశి:
మిథున రాశి వారికి నవపంచం రాజయోగం వల్ల చాలా ప్రయోజనాలు పొందనున్నారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్టుతో ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించుకుంటారు.
మేషం:
నవపంచం రాజయోగం వల్ల మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు, అంతేకాకుండా బిజినెస్ కూడా విస్తరిస్తారు.
Also Read: Angaraka Yogam : అంగారక యోగం అంటే ఏమిటి? మీ జాతకంలో ఇది ఏర్పడితే ఏం జరుగుతుందో తెలుసా?
కర్కాటకం:
కర్కాటక రాశి వారికి నవపంచం రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. పూర్వీకుల ఆస్తుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సజావుగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలనే మీ డ్రీమ్ నెరవేరుతుంది.
కన్య:
శని కుజుడు కలయిక వల్ల కన్యా రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఎంందులోనైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. ఉద్యోగులకు కూడా మంచి టైం నడుస్తోంది.
Also Read: Mercury Combust 2023: బుధుడి అస్తమయం, ఏప్రిల్ 23 నుంచి ఆ 4 రాశులకు తీవ్ర సమస్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook