Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!

Mercury, Venus, Rahu Transit: దాదాపు 50 ఏళ్ల తర్వాత హిందూ ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, రాహు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 14, 2024, 09:28 AM IST
Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!

Mercury, Venus, Rahu Transit: అన్ని గ్రహాలకు రాకుమారుడిగా భావించే బుధుడు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో రాశి సంచారం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కొన్ని సమయాల్లో నక్షత్ర సంచారాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ గ్రహం 12 రాశులు చివరి రాశి అయిన మీనంలోకి సంచారం చేయబోతోంది. ఇప్పటికే ఆ గ్రహంలో సంపద శ్రేయస్సుకు కారకంగా పరిగణించే శుక్రుడు ఉన్నాడు. అలాగే అంతుచిక్కని గ్రహంగా పిలిచే రాహువు కూడా సంచార దశలో ఉన్నాడు. దీని కారణంగా మీనరాశిలోకి ఈ బుధుడు ప్రవేశించడంతో బుధ, శుక్ర, రాహుల కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది. ఇది చాలా ఏళ్ల తర్వాత ఈ మూడు రాశుల కలయిక కారణంగా ఏర్పడబోతోంది. కాబట్టి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అలాగే ఈ త్రిగ్రహి యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి:
శుక్రుడు రాహువు బుధ గ్రహాలు మీనరాశిలో కలవడం కారణంగా అద్భుతమైన త్రిగ్రహీయోగ ప్రభావం మిధున రాశి వారిపై ప్రత్యక్షంగా పడబోతోంది. దీని కారణంగా ఈ రాశి వారు ప్రతి పనిలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆర్థిక పరిస్థితుల్లో కూడా అనేక మార్పులు వచ్చి నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి పొందుతారు. అలాగే వ్యాపారాల్లో కూడా విపరీతమైన పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. అంతే కాకుండా ఆరోగ్యం కూడా కాస్త మెరుగుపడుతుంది.

కుంభరాశి:
కుంభ రాశి వారికి మీనరాశిలో జరిగే ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయం వ్యాపారవేత్తలకు చాలా లాభసాటిగా మారుతుంది గతంలో జరుపుకున్న వ్యాపార ఒప్పందాల్లో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో విదేశీ ఒప్పందాలు కూడా జరుగుతాయి. కాబట్టి దీని కారణంగా ఊహించని డబ్బులు వస్తాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు అందుకుంటారు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

మీన రాశి:
మీన రాశి వారికి ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరి ఆదాయం పెరిగి విపరీతమైన ఖర్చులు తగ్గే అవకాశాలున్నాయి. అలాగే కెరీర్ కు సంబంధించిన విషయాల్లో నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో ఊబందుకుంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి శృంగారభరితంగా ఉంటుంది. దీంతో పాటు పెట్టుబడుల పరంగా కూడా మీకు ఈ సమయం కలిసి వస్తుంది. అలాగే ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులు కూడా ఈ సమయంలో సులభంగా చేయగలుగుతారు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News