kendra trikon rajyog in Mesh Rashi 2024: జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహాన్ని ఫ్లానెట్ ఆఫ్ ప్రిన్స్ అని పిలుస్తారు. బుధుడి గమనంలో వచ్చే చిన్న మార్పు కూడా ప్రజల జీవితాలపై పెను ప్రభావాలను చూపుతుంది. మీ జాతకంలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు, అదే అతడు ప్రతికూల స్థానంలో మీ లైఫ్ గందరగోళానికి గురవుతుంది. రీసెంట్ గా అంటే మార్చి 26న మెర్క్యూరీ మేషరాశిలోకి ప్రవేశించింది. దీని కారణంగా అరుదైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీని కారణంగా మూడు రాశులవారు కింగ్ లా బతకబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్యా రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీ లైఫ్ లోని టెన్షన్స్ అన్నీ పోయి... మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ శాలరీ భారీగా పెరుగుతుంది. మీరు నలుగురిలో గౌరవించబడతారు. మీ పనిని మెచ్చుకుంటారు. మీ కష్టాలు మిమ్మల్ని రాటుదేలేలా చేస్తాయి. మీ కెరీర్ ఆశించిన దాని కంటే మెరుగ్గా ఉంటుంది. మీకు లక్ ప్యాక్టర్ ఉంటుంది.
వృషభ రాశి
మేషరాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం వృషభరాశి వారి కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది. వీరు ఉన్నత చదువులు లేదా వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కెరీర్ లో మంచి గ్రోత్ ఉంటుంది. మీరు అనుకున్న స్థాయికి వెళతారు. బిజినెస్ భారీగా విస్తరిస్తుంది, లాభాలు అధికంగా ఉంటాయి. మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.
మకర రాశి
బుధుడు రాశి మార్పు మకరరాశి వారికి ఎల్లవేళలా మంచి ప్రయోజనాలనే ఇస్తుంది. వీరు ఆర్థికంగా బలపడి.. భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీరు కోర్టు కేసుల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. మీరు అనుకున్న దాని కంటే మంచి పొజిషన్ లో ఉంటారు. మీ ఫ్యామిలీలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీరు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Budh Ast 2024: ఏప్రిల్ నెలలో ఈ 4 రాశుల జీవితాన్ని నాశనం చేయబోతున్న బుధుడు.. ఇందులో మీ రాశి ఉందా?
Also Read: Astrology: రేపటి నుండి ఈ 3 రాశులవారికి సుడి తిరగబోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి