Mercury Transit 2023: వృషభరాశి ప్రవేశం, ఆ 5 రాశుల జీవితాల్లో జూన్ 7 నుంచి కల్లోలం తప్పదా

Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ఉంటుంది. గ్రహాల గోచారం లేదా గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. అయితే కొన్ని రాశులపై అనుకూలంగా మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 12, 2023, 06:02 AM IST
Mercury Transit 2023: వృషభరాశి ప్రవేశం, ఆ 5 రాశుల జీవితాల్లో జూన్ 7 నుంచి కల్లోలం తప్పదా

Mercury Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం ఒక్కో గ్రహాన్ని కొన్ని అంశాలకు కారకుడిగా భావిస్తారు. అదే విధంగా బుధుడిని తర్కం, బుద్ధిని ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. గ్రహాల రాజకుమారుడు బుధుడి రాశి ప్రవేశం 5 రాశుల జీవితాల్లో భారీగా కల్లోలం కల్గించనుంది. ఆ వివరాలు మీ కోసం..

బుధుడు జూన్ 7వ తేదీన వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం బుధగ్రహం ఎప్పుడు వృషభంలో ప్రవేశించినా ఆ జాతకులకు ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల, ప్రతికూల ప్రభావం రెండూ ఉంటాయి. ముఖ్యంగా 5 రాశులపై స్పష్టంగా కన్పించనుంది. ఈ 5 రాశుల జీవితాలను కల్లోలం చేయనుంది. అందుకే ఈ 5 రాశులవాళ్లు అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఆ దుష్ప్రభావం నుంచి తప్పించుకునేందుకు కొన్ని ఉపాయాలు ఆచరించాల్సి ఉంటుంది. బుధుడి వృషభ రాశి ప్రవేశం 5 రాశులకు ప్రతికూలం కల్గించనుంది. 

వృశ్చిక రాశి జాతకులకు బుధుడి గోచారం ప్రభావంతో అత్యంత ప్రతికూలంగా ఉండనుంది. విధి ఏ మాత్రం సహకరించదు. పని ఒత్తిడి పెరగడంతో ఆందోళనకు గురవుతుంటారు. పనిచేసేచోట పై అధికారులు, ఉద్యోగులతో బంధం చెడిపోవచ్చు. ఎందులోనైనా సరే ఊహించినమేర ప్రయోజనాలు కలగవు. పెట్టుబడులకు ఏమాత్రం అనువైన సమయం కాదు. జీవిత భాగస్వామితో  విభేదాలు ఉత్పన్నం కావచ్చు. 

బుధుడు జూన్ 7న వృషభ రాశిలో ప్రవేశించనుండటం మేష రాశి జాతకులకు అశుభం కల్గించనుంది. ఫలితంగా జీవిత భాగస్వామితో విబేధాలు తలెత్తుతాయి. ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కెరీర్‌పరంగా అంతా ప్రతికూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి వెంటాడుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొన్ని మంత్రాలు పఠించాలంటారు జ్యోతిష్య పండితులు. ఇక ఆరోగ్యం కూడా ఈ రాశివారికి అంతగా బాగుండదు. చాలా అప్రమత్తంగా ఉండాలి.

మీన రాశి జాతకులకు బుధుడి వృషభ రాశి పరివర్తనం ప్రభావం దుష్పరిణామాలకు కారణమౌతుంది. రోజువారీ జీవితంలో పలు సవాళ్లు ఎదుర్కోవల్సివస్తుంది. జీవితంలో కొన్ని జటిలమైన సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అంటువ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా మారుతుంది. ధనహాని కలగడంతో ఆర్ధిక సమస్యలు వెంటాడుతాయి.

సింహ రాశి జాతకులకు బుధుడి వృషభ రాశి పరివర్తనం ప్రభావం చాలా సమస్యలకు కారణమౌతుంది. వ్యాపారంలో పోటీ ఎక్కువ కావడం వల్ల ఆర్ధికంగా నష్టాలు రావచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా కన్పిస్తుంది. అటు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. అంటురోగాలు, చర్మ సంబంధిత సమస్యలు సోకవచ్చు. కెరీర్‌పరంగా అనుకూలం కాదు. 

బుధుడి రాశి పరివర్తనం ప్రభావం మిధున రాశి జీవితంలో కల్లోలం సృష్టించనుంది. కుటుంబంలో చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆదాయమార్గాలు అంతంతమాత్రంగానే ఉండి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవడం వల్ల ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉండదు. అటు పనిచేసే చోట కూడా వాతావరణం అనుకూలంగా ఉండదు.

Also read: Surya Gochar 2023: సూర్య సంచారం 2023.. కన్యా రాశి వారికి అదృష్టం! కోరుకున్న ఉద్యోగం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News