Budh Gochar 2024: రేపటి నుండి ఈ 3 రాశుల సుడి తిరగబోతోంది.. ఇందులో మీ రాశి ఉందా?

Mercury transit 2024: ఫిబ్రవరి 1 బుధుడి మకరరాశి ప్రవేశం చేసి సూర్యుడిని కలిశాడు. వీరిద్దరి కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. దీంతో కొందరి అదృష్ట తలుపులు తెరుచుకోనున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 09:13 PM IST
Budh Gochar 2024: రేపటి నుండి ఈ 3 రాశుల సుడి తిరగబోతోంది.. ఇందులో మీ రాశి ఉందా?

Budh Gochar 2024 effect: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. నిన్ననే (ఫిబ్రవరి 1) బుధుడు మకరరాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఇదే రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. మకరరాశిలో బుధుడు మరియు సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనిని శుభకరమైన యోగంగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల కొందరి జీవితాలు మారబోతున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

బుధాదిత్య రాజయోగం ఈ రాశులకు వరం
మేష రాశి
బుధ గ్రహ సంచారం వల్ల మేష రాశి వారు చాలా ప్రయోజనాలను పొందుతారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారి కోరిక నెరవేరుతోంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.  అదృష్టం మీ వెంటే ఉంటుంది. 
వృషభరాశి
వృషభ రాశి వారికి బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న మీ కోరిక నెరవేరుతోంది. మీరు  ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ జీతం విపరీతంగా పెరుగుతుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. మీకు లక్ కలిసి వస్తుంది.

Also Read: Astrology: ఫిబ్రవరి 05 నుంచి వీరు ఏది ముట్టుకున్నా బంగారమే.. మీ రాశి ఉందా?

కర్కాటక రాశి
మెర్క్యూరీ రాశి మార్పు కర్కాటక రాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీరు కెరీర్ లో ఊహించని పురోగతి సాధిస్తారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు పేదరికం నుండి బయటపడతారు. 

(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Trigrahi Yog 2024: 50 ఏళ్ల తర్వాత కుంభరాశిలో త్రిగ్రాహ యోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News