Budh Uday Benefits: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఆస్ట్రాలజీలో గ్రహాల అస్తమయం అశుభకరమైనదిగా భావిస్తారు. ఇది ఎల్లప్పుడూ చెడు ఫలితాలనే ఇస్తుంది. అయితే గ్రహాల రైజింగ్ అనేది శుభఫలితాలను ఇస్తుంది. గ్రహాల రాకుమారుడిగా పిలువబడే బుధుడు రీసెంట్ గా కర్కాటక రాశిలో ఉదయించాడు. జ్ఞానం, తెలివితేటలు, వ్యాపారం, గణితం, తర్కానికి కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. బుధుడి ఉదయం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
మకరరాశి
మకర రాశి వారికి బుధుడు ఉదయించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పార్టనర్ షిప్ చేసే పనుల్లో లాభం ఉంటుంది. మీ కెరీర్ ఊహించని మలుపు తిరుగుతుంది.
కన్య
బుధుడి రైజింగ్ కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జాబ్ కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతుంది. పని మరియు వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారవేత్తలు మంచి ఆర్డర్లు పొందుతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also read: Guru vakri 2023: గురు వక్రీతో ఈ 3 రాశుల బతుకులు మారబోతున్నాయి.. మీ రాశి ఉందా?
మిధునరాశి
మెర్క్యూరీ గ్రహం ఉదయించడం వల్ల మిథున రాశి వారికి కలిసి వస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు స్థిర చరాస్తులు దక్కుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Kark Sankranti 2023: కర్క సంక్రాంతితో ఈ 5 రాశులకు లాభం.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook