Budh Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు, గ్రహాల యువరాజు అని పిలుస్తారు. మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 07 మెర్క్యూరీ వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 24 వరకు బుధుడు ఇదే రాశిలో ఉంటాడు. సూర్యుడు ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నాడు. వీరిద్దరి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. బుధ సంచారం మూడు రాశులవారికి శుభఫలితాలను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
బుధ సంచారం ఈ రాశులకు వరం
వృషభ రాశి - బుధ సంచారం వృషభరాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. లవ్ సక్సెస్ అవుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు డబ్బును ఆదా చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
కన్యారాశి - మెర్క్యూరీ రాశి మార్పు కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం కలిసి వస్తుంది. మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. రచన రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Budh Gochar 2023: జూన్ నెలలో రెండుసార్లు రాశిని మార్చునున్న బుధుడు.. ఈ 4 రాశులకు తిరుగులేదు చూడు..
మకరం - వృషభరాశిలో బుధ సంచారం మకరరాశి వారికి కలిసి వస్తుంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. పెట్టుబడి ద్వారా లాభాలను పొందుతారు. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి ప్రయోజనం పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.
Also Read: Shani Vakri 2023: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook