Mauni amavasya: పుష్య మాసంలో వచ్చే చివరి అమావాస్యను మౌనీ అమావాస్యగా పిలుస్తుంటారు. ఈరోజున చేసే పూజలు వ్రతాలు, దోషపరిహర పూజలు గొప్ప ఫలితాలను ఇస్తాయంట. అందుకే ఈ రోజును హిందు సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. జనవరి 29న మనం మౌనీ అమావాస్యను జరుపుకోబుతున్నాం. ఈ రోజును భక్తులు ఎంత వీలైతే అంతగా భగవతారధాన, వ్రతాలు, శ్రాద్దకర్మాదికాలు, శాంతులు చేయించుకుంటే .. అవి కోటిరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశంలో మహా కుంభమేళ పుణ్య కాలంకూడా నడుస్తుంది. 144 ఏళ్ల తర్వాత ఈ కుంభమేళ ఉత్సవం జరుగుతుంది. ప్రయాగ్ రాజ్ లో ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ముఖ్యంగా పుష్య మాసంలో కొన్నిపరిహారాలు పాటిస్తే ఎంతటి దరిద్రులైన .. అపర కుబేరులుగా కావడం ఖాయమంట. ముఖ్యంగా మౌనీ అమావాస్య రోజున సూర్యోదయంకు ముందే నిద్రలేవాలి.
ఆ తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించాలి. ఆరోజున దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. దేవుడి గదిలో అభిషేకం, పూలతో అలంకరణం చేసి, నైవేద్యం చూపించాలి. ఆతర్వాత నల్లని నువ్వులు తీసుకుని.. ఒక తెల్లని చిన్న గుడ్డముక్క తీసుకుని దానిలో వేసిమూటలాగా కట్టాలి.
Read more: Mauni Amavasya: మౌనీ అమావాస్య ఎప్పుడు..?.. కుంభమేళలో దీని ప్రాధాన్యత ఏంటో తెలుసా..?
దీన్ని మీ ఇంటి చుట్టు క్లాక్ వైస్.. ఐదు సార్లు దేవుడ్ని స్మరించుకుంటూ తిప్పి.. ఆ మూటతో పాటు.. ఇంటి బైటకు వచ్చేసి ప్రవహించే నీళ్లు లేదా నది లేదా చెరువులోకి విసిరివేయాలి. మరల వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి.. కాళ్లు చేతులు కడిగిన తర్వాతే లోపలికి ప్రవేశించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి అడ్రస్ ను వెతుక్కుంటూ మరీ వస్తుందంట. జీవితంలో ధనంకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోటు అనేది ఉండదంట. ( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది.. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు..)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter