Mars Transit 2022: వృషభరాశిలో కుజుడు సంచారం.. ఆగస్టు 10 నుండి ప్రకాశించనున్న ఈ రాశుల వారి అదృష్టం!

Mars Transit 2022: వచ్చే నెలలో కుజుడు తన రాశిని మార్చబోతున్నాడు. దీని ప్రభావం 5 రాశులవారికి కలిసి రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2022, 03:50 PM IST
Mars Transit 2022: వృషభరాశిలో కుజుడు సంచారం.. ఆగస్టు 10 నుండి ప్రకాశించనున్న ఈ రాశుల వారి అదృష్టం!

Mars Transit 2022: అంగారక గ్రహం వచ్చే నెలలో రాశిని మార్చబోతుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. పూజలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో ఇప్పటికే బుధుడు, సూర్యుడు మరియు శుక్రుడు తమ రాశిని మార్చాయి. శ్రావణం ముగిసేలోపు కుజుడు కూడా రాశిని మార్చబోతున్నాడు.  ఆగస్టు 10, 2022 రాత్రి 9:32 గంటలకు కుజుడు వృషభరాశిలోకి (Mars Transit in Taurus 2022)ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశుల భవితవ్యం మారబోతుంది.కుజుడు రాశి మార్పు ఏ రాశివారికి లాభమో ఇప్పుడు తెలుసుకుందాం. 

వృషభం (Taurus): వృషభరాశిలో కుజుడు సంచారం ఈ రాశివారి అదృష్టాన్ని మార్చనుంది. వీరి ఆదాయం పెరుగుతుంది.  ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారస్థులు లాభపడతారు. 

కర్కాటకం(Cancer): అంగారకుడి సంచారం కర్కాటకరాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశివారు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. అప్పుల బారి నుండి బయటపడతారు. 

సింహరాశి(Leo): ఆగస్ట్ 10 తర్వాత సింహరాశి వారి జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. వీరు ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి  సమయం.  

ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశివారికి అంగారక సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. 

కుంభ రాశి (Aquarius): కుంభ రాశి వారికి అంగారక సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వ్యక్తుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.  

Also Read: నాగపంచమి రోజు ఇంటి బయట ఈ ఒక్క పేరు రాయండి చాలు.. పాములు ఎప్పుడూ మీ ఇంట్లోకి రావు!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News