Mars Transit 2023: మంగళ గ్రహం గోచారం ప్రభావం, మరో 69 రోజుల వరకూ ఈ రాశులపై ఊహించని కనకవర్షం

Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై గణనీయంగా పడుతుంది. హిందూ జ్యోతిష్యం ప్రకారం మార్చ్ 13వ తేదీన మంగళ గ్రహం మిధున రాశి ప్రవేశముంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం...

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2023, 07:05 AM IST
Mars Transit 2023: మంగళ గ్రహం గోచారం ప్రభావం, మరో 69 రోజుల వరకూ ఈ రాశులపై ఊహించని కనకవర్షం

Mars Transit 2023: మంగళ గ్రహం ప్రవేశం ఆ రాశులపై అత్యంత మంగళంగా ఉండనుంది. మంగళ గ్రహం మిధున రాశి పరివర్తనం కారణంగా మరో 69 రోజుల వరకూ ఆ రాశులకు తిరుగుండదు. అపారమైన ధనవర్షంతో ఉక్కిరిబిక్కిరౌతారు. మార్చ్ 13 నుంచి జాతకం మారనున్న ఆ రాశులేంటో పరిశీలిద్దాం..

ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. అదే విధంగా గ్రహాలకు సేనాపతిగా పిలిచే మంగళ గ్రహం మార్చ్ 13వ తేదీన మంగళ గ్రహం మిధున రాశిలో ప్రవేశించనుండటంతో ఆ రాశిలో నవమ పంచమి యోగం ఏర్పడనుంది. మంగళ గ్రహం మిధునంలో ఇదే రాశిలో 69 రోజుల వరకూ విరాజిల్లనున్నాడు. మంగళ గ్రహం మిధున రాశి ప్రవేశం కొన్ని రాశుల జీవితాలపై శుభప్రదంగా ఉంటుంది. 

మంగళ గ్రహం ప్రభావం ఈ రాశులపై..

సింహ రాశి

మంగళ గ్రహం మిధున రాశి పరివర్తనం ప్రభావంతో సింహ రాశి జాతకులకు ఊహించని లాభముంటుంది. మీరు పెట్టిన పాత పెట్టుబడులు లాభాల్ని ఆర్జిస్తాయి. ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే..ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. జీతంలో పెరుగుదలకు పూర్తి అవకాశాలున్నాయి. ధనలాభం కలుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. 

మకర రాశి

మంగళ గ్రహం రాశి పరివర్తనంతో మిధునరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఊహించని లాభాన్నిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కెరీర్‌పరంగా ఇది అత్యంత అనుకూలమైన సమయం. ధనలాభం కలగనుంది. 

కన్యా రాశి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ గ్రహం మిధున రాశిలో గోచారం వల్ల ఈ రాశివారికి పదోన్నతులు లభిస్తాయి. మీ బాస్ ప్రశంసలు మిమ్మల్ని ఆనందింపజేస్తాయి. ఏదైనా అవార్డు లభించవచ్చు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. 

మేష రాశి

జ్యోతిష్యం ప్రకారం మేషరాశి వారికి మంగళ గ్రహం గోచారం చాలా బాగుంటుంది. ఈ రాశివారిలో పాజిటివ్ ఎనర్జీ కన్పిస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కెరీర్ చాలా లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులు విజయం సాధిస్తారు. 

మిధున రాశి

జ్యోతిష్యశాస్త్రం ప్రకార మిధునరాశి జాతకులపై మంగళ గ్రహం గోచారం ఊహించని ధనలాభాన్ని కలగజేస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి లాభాలుంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంపదలో వృద్ధి ఉంటుంది. ఈ కాలంలో ఏదైనా కీలకమైన ఒప్పందాలు పూర్తి చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. 

Also read: Sun Transit 2023: కేవలం మరో 5 రోజుల్లో ఈ 5 రాశులకు దశ తిరగడం ఖాయం, వద్దంటే డబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News