Navpancham Yog 2023: 'నవపంచం రాజయోగం' చేస్తున్న కుజుడు-శని... ఈ రాశుల ఇంటిపై డబ్బు వర్షం..

Navpancham Yog 2023:  కుజుడు, శనిదేవుడు నవపంచమ రాజయోగాన్ని చేస్తున్నారు. ఇది కొంత మందికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2023, 04:34 PM IST
Navpancham Yog 2023: 'నవపంచం రాజయోగం' చేస్తున్న  కుజుడు-శని... ఈ రాశుల ఇంటిపై డబ్బు వర్షం..

Navpancham Rajyog in Telugu: వైదిక జ్యోతిష్యంలో అనేక రకాల రాజయోగాలు గురించి చెప్పబడ్డాయి. అందులో ఒకటి నవపంచమ రాజయోగం. ప్రస్తుతం కుజుడు మిథునరాశిలోనూ, శనిదేవుడు కుంభరాశిలోనూ సంచరిస్తున్నారు. కుజుడు శని నుండి ఐదవ ఇంట్లోనూ, మరియు శని అంగారకుడి నుండి తొమ్మిదవ ఇంట్లోనూ కూర్చున్నారు. దీని కారణంగా నవపంచం రాజయోగం ఏర్పడుతుంది. ఈయోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

నవపంచం రాజయోగం ఈ రాశులకు వరం
మేషరాశి - నవపంచం రాజయోగం మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ప్రతి పనిని సులభంగా పూర్తిచేస్తారు. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఐటీ రంగానికి చెందిన వారు ఎక్కువ ప్రయోజనం పొందుతారు.
కన్యారాశి - నవపంచం రాజయోగం కన్యా రాశి వారికి లాభాలను ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. జీతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో మీరు పెద్ద బాధ్యతను తీసుకుంటారు. మీరు పెద్ద కంపెనీలో జాబ్ పొందుతారు. మీ శత్రువులు అంతమవుతారు. పూర్వీకుల ఆస్తి మీకు దక్కే అవకాశం ఉంది. 
కుంభం - నవపంచం రాజయోగం కుంభ రాశి వారికి గౌరవ మర్యాదలను పెంచుతుంది.  మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. మీ ఫ్యామిలీ ప్రెండ్స్ సపోర్టుతో ఒక పెద్ద పనిని పూర్తిచేస్తారు. మీ ఇంట్లో డబ్బు రాక మెుదలవుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది మంచి సమయం.

Also Read: Budha rahu yuti 2023: శ్రీరామనవమి తర్వాత బుధ-రాహు కలయిక.. ఈ 3 రాశులకు కష్టాలే ఇక.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News