Mangal Margi 2023: బుధ గ్రహ సంచారం వల్ల ఈ రాశులవారికి నష్టాలు తప్పవా..?

Budh Grah Margi in Dhanu 2023: బుధ గ్రహం రాశి సంచారం చేయడం వల్ల పలు రాశులవారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల దుష్ర్పభావాలకు కూడా గురవుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2023, 09:56 AM IST
Mangal Margi 2023: బుధ గ్రహ సంచారం వల్ల ఈ రాశులవారికి నష్టాలు తప్పవా..?

Budh grah margi 2023 : గ్రహ సంచారాలకు, తిరోగమనలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏదైనా గ్రహం సంచారం చేసినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై పడి మనుషుల జీవితాల్లో మార్పులు సంభవిస్తాయని అందరికీ తెలిసింది. అయితే కొన్ని పెద్ద గ్రహాలు సంచారం చేయడం వల్ల దాని ప్రభావం అన్ని రాశుల వారిపై పడి జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం బుధ గ్రహం కూడా సంచారం చేయబోతోంది. దీని కారణంగా 12 రాశులవారుపై ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రాశువారు మాత్రం తీవ్ర దుష్ర్పభావాలకు గురవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలసుకుందాం..

ఈ రాశువారిపై తీవ్ర ప్రభావం:

మేష రాశి:
మేష రాశి వారు ఈ సంచారం కారణంగా పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యర్థుల నుంచి సురక్షితంగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ఛాన్స్‌ ఉంది. ఈ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.

వృషభం:
బుధగ్రహ సంచారం వల్ల వృషభ రాశివారు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలో ఉన్నతాధికారులతో లేదా సహోద్యోగులతో విభేదాలు పడొచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కూడా పలు రకాల సమస్యలకు గురవుతారు. కాబట్టి తప్పకుండా ఆచితుచి మాట్లడాల్సి ఉంటుంది.  అంతేకాకుండా ఈ రాశివారు ఆర్థిక సమస్యలకు కూడా గురవుతారు.

మిథునరాశి:
బుధ గ్రహ సంచారం మిథునరాశి వారిపై కూడా పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగానే మిథునరాశి వారికి హెచ్చు తగ్గులు మొదలవుతాయి.  ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు కార్యాలయంలో ఎలాంటి కుట్రలకు పాల్పడకుండా ఉండండి.

Also Read: Pawan Kalyan Speech: నేను అన్నింటికీ తెగించిన వాడిని.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ రియాక్షన్ ఇదే..   

Also Read: Pawan Kalyan: ఆ రోజు సినిమాలు వదిలేస్తా.. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్ కళ్యాణ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News