Mangal Gochar 2022: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. ఈ గ్రహాల కదలికల ప్రభావం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ, కొన్ని రాశుల వారిపై ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో వారు దాని వల్ల అపారమైన ప్రయోజనాన్ని పొందుతారు. కొన్ని గ్రహాల రాశిచక్రం మారడం కొన్ని రాశులకు మంచిది, కొన్ని రాశుల వారికి అశుభం. అక్టోబర్ 16న అంగారక గ్రహం తన రాశిని మార్చుకుని వృషభరాశి నుంచి మిధునరాశిలోకి (Mangal Gochar In Gemni 2022) ప్రవేశిస్తుంది. మేష, కన్యా రాశులకు అధిపతి కుజుడు. అంతేకాకుండా బలం, శక్తికి కారకుడు. మిథునరాశిలో కుజ సంచారం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
సింహం (Leo)- మిథునరాశివారికి అంగారక సంచారం శుభప్రదంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఈ సమయంలో మీరు మెుదలుపెట్టిన పనిని పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి (Cancer) - ఈ సంచారం కర్కాటక రాశి వారి జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల బాధ్యత పెరగవచ్చు లేదా జీతం పెంచవచ్చు. త్వరలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఆస్తి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిథునరాశి (Gemini)- అక్టోబర్ 16న కుజుడు వృషభరాశిని వదిలి మిథునరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో ఈ రాశివారు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ-వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. కుటుంబంతో సత్సంబంధాలు మెరుగవుతాయి. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. వ్యాపారులు లాభపడతారు. ఆఫీసులో సహోద్యోగుల ప్రశంసలు అందుకుంటారు.
Also read: Shanidev Grace Punishment: జీవితంలో జరిగే ఈ సంఘటనల ద్వారానే.. శని దేవుని అనుగ్రహాన్ని తెలుసుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook