Makar Sankranti 2023, Donate These Things for happiness and prosperity: దానం చేయడం వల్ల మనిషి ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా సౌభాగ్యం పొందుతాడని హిందూ ప్రజల నమ్మకం. దానం చేయడం వల్ల మనిషికి మోక్షం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి చేసే పనులు మెరుగుపడతాయట. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుందట. దాతృత్వం గురించి మాట్లాడినప్పుడు దధీచి ఋషి, కర్ణుని పేర్లు మనకు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే.. దధీచి తన ఎముకలను కూడా దానం చేశాడు. ఇక అంగదేశ రాజు కర్ణుడు ఓ బిచ్చగాడికి తన బంగారు దంతాలను దానం చేసాడు.
దానం చేయడం వల్ల మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మికతో పాటు అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. అందుకే మనకు ఉన్నంతలో సాయం చేయాలని పెద్దలు చెబుతారు. మకర సంక్రాంతి 2023 సందర్భంగా దానం చేస్తే.. దానం ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. మకర సంక్రాంతి రోజు నువ్వులు, కిచడీ, బెల్లం మరియు దుప్పటి మొదలైన వస్తువులు దానం చేయడం మంచిది. ఈరోజు మరికొన్ని వస్తువులను కూడా దానం చేయవచ్చు. మకర సంక్రాంతి నాడు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
మకర సంక్రాంతి నాడు దానం చేయాల్సిన వస్తువులు:
మేషం: బెల్లం, శనగ పప్పు, నువ్వులు దానం చేయండి.
వృషభం: తెల్లటి గుడ్డ, పెరుగు, నువ్వులు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.
మిథునం: వెన్నెల పప్పు, బియ్యం, దుప్పటి దానం చేయాలి.
కర్కాటకం: బియ్యం, తెల్ల నువ్వులు దానం చేయండి.
సింహం: రాగి, గోధుమలు దానం చేయండి.
కన్యా: కిచిడీ, దుప్పటి, పచ్చని వస్త్రం దానం చేయాలి.
తుల: పంచదార, దుప్పటి దానం చేస్తే బాగుంటుంది.
వృశ్చికం: ఎర్రటి వస్త్రం, నువ్వులు దానం చేయండి.
ధనుస్సు: పసుపు వస్త్రం, పసుపు దానం చేయవచ్చు.
మకరం: నల్ల దుప్పటి, నూనె, నల్ల నువ్వులు దానం చేయండి.
కుంభం: నల్ల గుడ్డ, నల్ల ఉరద్, కిచడీ మరియు నువ్వులు దానం చేయండి.
మీనం: పట్టు వస్త్రం, శనగ పప్పు, బియ్యం, నువ్వులు దానం చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.