Mahalaya Amavasya 2022: ఇవాళే పితృ పక్షం చివరి రోజు, పొరపాటున కూడా ఈ పని చేయకండి..

Sarva Pitru Amavasya 2022: పితృ పక్షంలో శ్రాద్ధం చేసే చివరి రోజునే ఆశ్వినీ మాసం అమావాస్య అంటారు. ఇది ఇవాళే అంటే సెప్టెంబరు 25న వస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2022, 10:36 AM IST
Mahalaya Amavasya 2022: ఇవాళే పితృ పక్షం చివరి రోజు, పొరపాటున కూడా ఈ పని చేయకండి..

Sarva Pitru Amavasya 2022 Date: ఇవాళ అంటే సెప్టెంబరు 25, ఆదివారం పితృ పక్షం చివరి రోజు. ఈ రోజునే సర్వపితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటారు. మీ పూర్వీకులకు ఏ కారణం చేతనైనా శ్రాద్ధం చేయలేకపోతే, సర్వపితృ అమావాస్య (Sarva Pitru Amavasya 2022) నాడు దానిని చేయండి. దీంతో పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ రోజున శ్రాద్ధం, తర్పణం మరియు పిండదానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు ఏడాది పొడవునా ఉంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, సర్వపితృ అమావాస్య తిథి సెప్టెంబర్ 25 న తెల్లవారుజామున 3:12 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 26 తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. అయితే సర్వ పితృ అమావాస్య నాడు కొన్ని పనులు చేయడం నిషేదించబడింది. అవేంటో తెలుసుకుందాం. 

ఈ పనులు చేయకండి..
>> సర్వ పితృ అమావాస్య నాడు మీ ఇంటి నుండి ఎవరినీ ఒట్టి చేతులతో పంపించవద్దు. పేదవారికి, బ్రహ్మణులకు, నిస్సహాయులకు, స్త్రీలకు మీకున్న దాని ప్రకారం దానం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారు. 
>> పితృ పక్షం చివరి రోజున ఎవరినీ అవమానించవద్దు, చెడు మాటలు చెప్పవద్దు. లేకపోతే మీ పూర్వీకులకు కోపం వస్తుంది. 
>> మహాలయ అమావాస్య రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలు, గుడ్డు, మాంసం, చేపలు లేదా మద్యం వంటి ఆహారాన్ని తినవద్దు. వీటిని తీసుకోవడం వల్ల పూర్వీకులు చిరాకు కలుగుతుంది.

Also read: Shani Dev Margi October 2022: మార్గంలోకి శనిదేవుడు.. మరికొన్ని రోజుల్లో మారనున్న ఈ రాశుల ఫేట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News