Zodiac Sign: ఈనెల అదృష్టాన్ని పొందబోయే రాశులు ఇవే..ఇందులో మీ రాశి కూడా ఉందా?

Lucky Zodiac In September 2023: సెప్టెంబర్ నెలలో అతి ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఏయే రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2023, 09:28 AM IST
Zodiac Sign: ఈనెల అదృష్టాన్ని పొందబోయే రాశులు ఇవే..ఇందులో మీ రాశి కూడా ఉందా?

Lucky Zodiac In September 2023: సెప్టెంబర్ నెలలో చాలా గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఈ గ్రహాలు కొన్ని రాశుల వారి జాతకాల్లో అనుకూల స్థానాల్లో ఉంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల స్థానాల్లో ఉండబోతున్నాయి. దీని కారణంగా సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారి జీవితాల్లో గందరగోళ పరిస్థితులు ఎదురైతే మరికొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సెప్టెంబర్ నెలలో ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సెప్టెంబర్ నెల మొత్తం కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు ఆఫీసుల్లో కష్టపడి పనులు చేయడం వల్ల ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు చదువుల కోసం విదేశాలకు కూడా వెళ్ళవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.

మిథున రాశి వారికి కూడా సెప్టెంబర్ నెల ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ప్రేమ జీవితం గడుపుతున్న వారికి మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మీ భాగస్వామిపై ప్రేమ రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. 

Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం  

సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేకపోతే తీవ్ర ఇబ్బందుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరికి పని ఒత్తిడి కారణంగా మానసిక సమస్యలకు లోనవుతారు. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టే క్రమంలో తీవ్ర ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

మేష రాశి వారు కూడా ఈ నెలలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలి.. లేకపోతే తీవ్ర దుష్ప్రభావాల గురవుతారు. ముఖ్యంగా వీరు ఖర్చులను తగ్గించుకుంటే చాలా మంచిది లేదంటే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని పెండింగ్లో ఉంటుంది. కాబట్టి పలు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లడం చాలా మంచిది. ముఖ్యంగా మీరు కోపాన్ని తగ్గించుకుంటే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సెప్టెంబర్ నెలలో పెద్ద పెద్ద గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా మహాయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. కాబట్టి కొన్ని రాశుల వారికి త్వరలోనే శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. అంతేకాకుండా ఈ సంచారాలు చేసే రాశులు కొందరి జాతకాల్లో ఆ సుభస్థానాల్లో ఉన్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి మరికొన్ని రోజుల వరకు నష్టాలు తప్పవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News