Lohri 2023: లోహ్రీ పండుగ ఎప్పుడు? ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి?

Lohri 2023: ఉత్తర భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో లోహ్రీ ఒకటి. మనం జరుపుకునే భోగి పండుగనే అక్కడ లోహ్రీ అంటారు. ఈ పండుగ యెుక్క తేదీ, శుభ ముహూర్తం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2022, 12:32 PM IST
Lohri 2023: లోహ్రీ పండుగ ఎప్పుడు? ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి?

Lohri 2023 Significance: సిక్కులు మరియు పంజాబీల ప్రధాన పండుగ లోహ్రీ. దీనిని ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. ముఖ్యంగా దేశంలో ఈ పండుగను ఢిల్లీ, పంజాబ్ మరియు హర్యానాల్లో జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ ను శీతాకాలం ముగింపుకు చిహ్నంగా భావిస్తారు. ఎందుకంటే దీని తర్వాత పగలు ఎక్కువగా మరియు రాత్రి తక్కువగా ఉంటుంది. 2023లో లోహ్రీ ఎప్పుడు, శుభ సమయం మరియు పండుగ యెుక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి.  

లోహ్రీ 2023 తేదీ (Lohri Date)
నూతన సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగను 15 జనవరి 2023న జరుపుకుంటారు. లోహ్రీ పండుగ జనవరి 14, శనివారం వస్తుంది. దీనిని రైతుల పండుగగా భావిస్తారు.  అదే రోజు మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భోగి పండుగను జరుపుకుంటారు. 

లోహ్రీ 2023 ముహూర్తం ((Lohri Shubh Muhurat)
లోహ్రీని 'లాల్ లోయి' అని కూడా అంటారు. ఆరోజు సిక్కు మరియు పంజాబీ ప్రజలు భోగి మంటలను వెలిగిస్తారు. ఈ సంవత్సరం లోహ్రీ క్షణం రాత్రి 08.57 గంటలకు వస్తుంది. 

లోహ్రీ ప్రాముఖ్యత (Lohri Significance)
లోహ్రీ అనేది అగ్ని మరియు సూర్య భగవానునికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగ. పంట చేతికొచ్చిన ఆనందంలో ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. నువ్వులు, బెల్లం, గోధుమ చెవిపోగులు, రెవడీలను భోగి మంటల్లో వేసి.. అగ్నికి అహూతి ఇస్తారు. ఈ రోజున బెల్లం, నువ్వులు మరియు వేరుశెనగతో చేసిన వాటిని తినడం శుభప్రదంగా భావిస్తారు. లోహ్రీలో దుల్లా భట్టిని గుర్తు చేసుకుంటూ.. సుందరి-ముండ్రి కథ చెబుతారు. అంతేకాకుండా ఈ సందర్భంగా పంజాబీ ప్రజలు జానపద పాటలపై భాంగ్రా మరియు గిద్దా నృత్యం చేస్తూ సంబరాలు చేసుకుంటారు.

Also Read: Surya-Shani Yog 2023: కుంభంలో శని-సూర్యుని కలయిక.. ఈ రాశుల వారిపై డబ్బు వర్షమే ఇక.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News