Horoscope Today July 21st 2022: ఇవాళ గురువారం. హిందువులు శ్రీమహావిష్ణువును కొలుస్తారు. కొందరు సాయి బాబాను కూడా ఆరాధిస్తారు. గురువారం నాడు మహావిష్ణువును ఆరాధించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. గత జన్మ పాపాలు కూడా తొలుగుతాయని విశ్వసిస్తారు. మరి ఈ గురువారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి (Aries)
బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటారు. ఇంట్లో, ఆఫీసులో మీ చుట్టూ నెగిటివిటీ చేరుతుంది. మీ ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచాలి. లేనిపక్షంలో కుట్రలకు మీరు బాధితుడిగా మిగిలిపోతారు. వ్యాపార వర్గాలకు ఇది ప్రతికూల సమయం. కొత్త పెట్టుబడులు లేదా ఒప్పందాలు కొద్దిరోజులు వాయిదా వేసుకోవడం ఉత్తమం. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
వృషభ రాశి (Taurus)
పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మునుపటికన్నా మీలో సహనం పెరుగుతుంది. ఓర్పుగా పనులు చక్కబెడుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ప్రభావశీలురైన వ్యక్తుల పరిచయం మీ ఆలోచలను మారుస్తుంది. వృత్తిపరంగా అది కలిసొస్తుంది. ప్రేమలో ఉన్నవారు ప్రియుడు లేదా ప్రియురాలితో రొమాంటిక్‌గా గడుపుతారు. వివాహితులు జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమగా ఉంటారు.
మిథున రాశి (GEMINI)
ఇవాళ మీలో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. సాయం కోరే వ్యక్తులకు కాదనకుండా తోచిన మేర సాయం అందిస్తారు. మతపరమైన సంస్థలకు లేదా సేవా సంస్థలకు ఆర్థిక సాయం చేస్తారు. మీ కర్మ ఫలం మిమ్మల్ని సంక్లిష్ఠ పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తుంది. మీ చుట్టూ ఏదో దైవిక శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ఊహించని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అది మిమ్మల్ని రక్షిస్తుంది.
కర్కాటక రాశి (Cancer)
ఇవాళ చాలా సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్నవాళ్లకు సంతోషాన్ని పంచుతారు. జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా ఉంటారు. ఏ నిర్ణయానికైనా కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగుతున్న జాబ్‌లో ఇదివరకటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తులు మరిన్ని లాభాల కోసం కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు.
సింహ రాశి (LEO)
తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అది మీలో అసంతృప్తిని, నిరాశను నింపుతుంది. ఎవరిని నమ్మలేని స్థితిలోకి వెళ్తారు. ధ్యానం చేయడం ద్వారా మీ మనసు కొంత కుదుటపడే అవకాశం ఉంది. లేదా దైవ మంత్రాన్ని పఠిస్తూ మనసులో దైవాన్ని తలుచుకుంటే కొంత ఉపశమనం పొందుతారు. పెద్దల ఆశీస్సులు మిమ్మల్ని ఈ స్థితి నుంచి బయటపడేసేందుకు దోహదపడుతాయి. సాయంత్రం సమయానికి కొంత ఊరట కలిగే అవకాశం ఉంది.
కన్య రాశి (Virgo)
చంద్ర అనుగ్రహం మీకు సంతోషాలు తీసుకొస్తుంది. ఏ పనిలోనైనా ఓర్పుతో ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు కోరుకున్న జాబ్‌ను పొందేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమికులు డేటింగ్‌కి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షాకాల సీజన్ కాబట్టి పిల్లలతో ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లవద్దు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
తులా రాశి (Libra)
ఇవాళ మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఎవరి నుంచి ఎక్కువగా ఆశించవద్దు. అది మిమ్మల్ని భంగపాటుకు గురిచేస్తుంది. మిమ్మల్ని మీరు అన్వేషించుకునే, విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తారు. అది మీలోని లోటుపాట్లను తెలుసుకుని సరిదిద్దుకునేలా చేస్తుంది. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు.
వృశ్చిక రాశి (Scorpio)
ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి మరోచోటుకు షిఫ్ట్ కావాలనుకుంటారు. కానీ ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది. పెట్టుబడులకు ప్రతికూల సమయం. సాయంత్రానికి పరిస్థితులన్నీ అదుపులోకి వస్తాయి. పెద్దల సలహాలతో కొన్ని గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. అనవసర వివాదాల్లో తలదూర్చి కొత్త తలనొప్పులు తెచ్చుకోవద్దు.
ధనుస్సు రాశి (Sagittarius)
వ్యాపారపరమైన ప్రయాణాలు చేస్తారు. మీ కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు. తోబుట్టువుల నుంచి శుభవార్త అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు సక్సెస్ అవుతారు. చాలాకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నవారికి ఎట్టకేలకు మంచి అమ్మాయి లేదా అబ్బాయి దొరుకుతారు. వివాహితులు కుటుంబంతో కలిసి పిక్నిక్కి ప్లాన్ చేస్తారు. పిల్లలకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకర రాశి (Capricorn)
ఇవాళ మీపై కుజ అనుగ్రహం ఉంటుంది. మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ చాకచక్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. మీ వ్యక్తిత్వం మీకు కాబోయే భార్య లేదా భర్తను ఆకర్షిస్తుంది. ఇప్పటికే పెళ్లయినవారైతే మీ జీవిత భాగస్వామి మీ ప్రతిభకు ముగ్ధులవుతారు. మీ ప్రేమ బంధం వికసిస్తుంది. ప్రేమికులు పెళ్లి నిర్ణయం తీసుకునేముందు ఇరు కుటుంబాల పెద్దలతో సంప్రదించాలి.
కుంభ రాశి (Aquarius)
కొద్దిసేపు సంతోషం, కొద్దిసేపు అసంతృప్తి, బాధ.. ఇవాళంతా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆరోగ్యం బాగుండదు. అనారోగ్యం కారణంగా ఏ పని సరిగా చేయలేరు. వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మీరు ఫిట్ అయ్యాకే ఏ పనైనా చేపట్టాలి. లేనిపక్షంలో ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. విద్యార్థులకు ఇది ప్రతికూల సమయం. అయితే పట్టుదలతో ప్రతికూలతను కూడా అధిగమించవచ్చు.
మీన రాశి (Pisces)
పెద్దల ఆశీస్సులతో కలిసొస్తుంది. పెట్టుబడుల విషయంలో లాభాలే తప్ప నష్టాలు ఉండవు. గతంలో చవిచూసిన నష్టాలు కూడా ఇప్పటి లాభాలతో భర్తీ అవుతాయి. మీ సేవింగ్స్ మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను పెంచుతాయి. పిల్లల భవిష్యత్తు కోసం కొత్త పెట్టుబడులు పెడుతారు. ఇంట్లో రుచికరమైన వంటలతో విందు చేసుకుంటారు. బంధువులు లేదా సన్నిహితులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: Kaleshwaram Pumps:నీటిలో మునిగిన కాళేశ్వరం పంపు రిపేర్లకు ఎంత ఖర్చో! సీనియర్ ఐఏఎస్ సంచలనం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook