Horoscope Today 28 June 2021: మేష రాశి
కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టాలని భావిస్తారు. ఇందుకోసం పెద్దల నుంచి సలహాలు, సహాయ సహకారాలు అందుకుంటారు. నగదుకు సంబంధించిన సమస్యలు తొలగుతాయి. కుటుంబసభ్యులకు సమయం కేటాయించి వారితో సరదాగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
వృషభ రాశి
మీ ఖర్చులు అధికం కానున్నాయి. తద్వారా కొత్తగా రుణయత్నాలు మొదలు పెడతారు. చేతిలో చిల్లిగవ్వలేక ఇంటా బయటా మీకు కొత్త సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది తగిన సమయంగా భావిస్తారు. సాయంత్రం వేళ మీకు కొంతమేర కలిసిరానుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
మిథున రాశి
కుటుంబసభ్యులు మీతో సరదాగా గడపాలని చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. వారు మీపై చూపే శ్రద్ధ, ప్రేమను తెలుసుకుని పశ్చాత్తాపానికి లోనవుతారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. కొందరు వ్యక్తుల కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. ఇంటా బయటా మీపై బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
కర్కాటక రాశి
మీరు కొన్ని విలువలకు కట్టుబడి ఉంటారు. ఇతరుల కోసం వాటిని మార్చుకునేందుకు సిద్ధపడని మనస్తత్వం మీది. నేడు కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. అనుకోని ప్రయాణాలతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
సింహ రాశి
మీరు నేడు మరింత ఉత్సాహంగా మీ పనులను పూర్తిచేస్తారు. ఎలాంటి మొహమాటాలకు వెళ్లకుండా కావలసిన విషయాన్ని అడిగి తెలుసుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగతాయి. పెట్టుబడులపై ఓ కన్నేసి ఉంచాలి.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
కన్య రాశి
నేడు కొన్ని విషయాలలో మీకు ఒత్తిడి అధికం కానుంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం ఉత్తమం. కుటుంబసభ్యులు, సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. ఎవరూ వెనక్కి తగ్గని పక్షంలో వివాదాలకు దారితీస్తుంది. ఆలయాలు సందర్శించాలని భావిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
తులా రాశి
మీరు ఎంచుకున్న పనిలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ అత్యుత్సాహం పనికిరాదు. ఇతరుల సంతోషం కోసం కొన్ని త్యాగం చేయడానికి సిద్ధపడతారు. మరియు ఎవరికైనా కాదు, లేదు అని చెప్పడం కష్టమని భావిస్తారు. అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి.
వృశ్చిక రాశి
నేడు సహాయం కోరడానికి ఓ వ్యక్తిని కలుసుకుంటారు. మీ సమస్యను చెప్పి వారి నుంచి సహాయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి చేతికి రానుంది. విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆలోచిస్తారు. పనిచేసే చోట ఒత్తిడి అధికం కావడంతో ఫలితాలు తగ్గుతాయి. పురోగతికి ఆటంకం కలుగుతుంది.
ధనుస్సు రాశి
కొత్త విషయాలను కనుగొనేందుకు ఫోకస్ చేస్తారు. మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తారు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడతారు. సన్నిహితులు, బంధువులతో మాట పట్టింపులు. గతంలో చేపట్టిన పనులలో ఆటంకాలు తలెత్తుతాయి.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
మకర రాశి
మీరు ఇతరులకు సహాయపడటానికి నిరంతరం సిద్ధంగా ఉంటారు. కానీ మీ సహాయం కోరే ఒక వ్యక్తి, మిమ్మల్ని దోపిడీ చేస్తాడని గ్రహిస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి అధిక సమయం కేటాయిస్తారు. నేడు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
కుంభ రాశి
మీరు శక్తికి మించి ఖర్చులు చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు అనర్థాలకు కారణం అవుతాయి. సమాజంలో పేరు, విలువ తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.
మీన రాశి
ఓ పనిలో మీరు అడుగు పెట్టడానికి సమయం ఆసన్నమైందని గ్రహిస్తారు. ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి లోనవుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలని తాపత్రయ పడతారు. ఇతరుల నుంచి కోరిన సహాయం తిరస్కరణకు గురవుతుంది. సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు మార్పు కోరుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook