Horoscope for October 27 : ఆ రాశి వారికి ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఫలితం దక్కుతుంది

Horoscope for October 27 : ఆ రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. వారికి శ్రీవెంకటేశ్వర సందర్శనం మంచిది. వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 09:52 AM IST
  • ఆ రాశివారు కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు
  • మిథునం రాశి వారికి శరీర సౌఖ్యం
  • కర్కాటక రాశి వారు ప్రారంభించిన పనులు కొద్దిగా ఆలస్యం
  • మకరరాశి వారు పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగితే మంచిది
Horoscope for October 27 : ఆ రాశి వారికి ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఫలితం దక్కుతుంది

Horoscope Today Astrological prediction for October 27: ఈ రోజు Horoscope Today మేషం నుంచి మీనం వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మేషం : Aries.. ఈ రాశి వారికి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఈ రాశి వారికి ఉంటారు. వీరు విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఈ రాశివారికి ఓర్పు అవసరం. శివనామస్మరణ మేషరాశి వారికి ఉత్తమం.

వృషభం ‌‌: Taurus
వృషభ రాశివారు కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. వృషభ రాశి వారికి కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠనం వృషభ రాశి వారికి మంచిది. 

మిథునం : Gemini

మిథునం రాశి వారికి శరీర సౌఖ్యం ఉంది. వారి ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. మిథునం రాశి వారికి యశస్సు వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారికి ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వీరికి ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

Also Read : PAK vs NZ Match: ఆ రెండు దృశ్యాలు అద్భుతాలే, పాక్ కివీస్ మ్యాచ్‌ వైరల్ అవుతున్నపిక్

కర్కాటకం: Cancer
కర్కాటక రాశి వారు ప్రారంభించిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. ఈ రాశి వారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. వీరికి శ్రమ కాస్త అధికం అవుతుంది. వీరు శివ నామాన్ని జపించాలి.

సింహరాశి: Leo
సింహరాశి వారికి చాలా గొప్ప శుభఫలితాలు వస్తాయి. వీరు మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. సింహరాశి వారిని ఇబ్బంది పెట్టాలని  చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. వీరు గురు ధ్యానం చేస్తే మంచిది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంతా శుభమే జరుగుతుంది. 

కన్యరాశి: Virgo
గతంలో కన్నా అనుకూలమైన సమయం కన్య రాశి వారికి ఉంటుంది. మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కన్యరాశి వారి ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సూర్య నమస్కారాలు చేయడం కన్యరాశి వారికి చాలా మంచిది.

తులరాశి :Libra

తులరాశి వారు కాస్త ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో ఈ రాశి వారు తల పెట్టిన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం మంచి ఫలితాన్నిఇస్తుంది.

వృశ్చికం : Scorpio

వృశ్చిక రాశి వారు ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. వీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వీరికి శారీరక శ్రమ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి దగ్గరి వారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. ఆహార నియమాలను వృశ్చిక పాటించాలి. వృశ్చిక రాశి వారు చంద్ర శ్లోకం చదివితే చాలా మంచిది.

ధనస్సు
మీరు ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది.

మకరం 
ధన,ధాన్య లాభాలు ఉన్నాయి. మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది. హనుమత్ ఎంతో ఆరాధన శుభప్రదం.

కుంభం
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించాలి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. 

మీనం
మీన రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా మీన రాశి వారు ఆలోచించి ముందుకు సాగాలి.  శ్రీవెంకటేశ్వర సందర్శనం ఉత్తమం.అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు.

Also Read : Tamilnadu: ఏఐఏడీఎంకేలో వర్గపోరు, చిన్నమ్మ జపం ప్రారంభించిన పన్నీర్ సెల్వమ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News