కార్తీకమాసంలో...ఇవాళ నవంబర్ 29 మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

గ్రహాల కదలికలు, రాశులను బట్టి దిన ఫలాలుంటాయి. ప్రతి ఒక్కరికీ తమ జన్మరాశిని బట్టి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కార్తీకమాసంలో ఇవాళ అంటే నవంబర్ 29వ తేదీన మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2021, 05:53 AM IST
కార్తీకమాసంలో...ఇవాళ నవంబర్ 29 మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

గ్రహాల కదలికలు, రాశులను బట్టి దిన ఫలాలుంటాయి. ప్రతి ఒక్కరికీ తమ జన్మరాశిని బట్టి జాతకం(Horoscope) ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కార్తీకమాసంలో ఇవాళ అంటే నవంబర్ 29వ తేదీన మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి : ఈ రాశివారికి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ మాటల్ని లేదా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఇబ్బందుల్లో పడతారు. దుష్ఫ్రవర్తనకు దూరంగా ఉండాలి. ఆర్ధికంగా ఇవాళ బాగానే ఉంటుంది. కుటుంబసభ్యులతో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం విషయంలో సమస్యలు ఎదురుకావచ్చు.

వృషభరాశి : ఇవాళ మీకు కష్టంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్నవి గానీ ఊహించినవి గానీ ఏవీ జరగవు. ఫలితంగా చికాకు కలిగి..మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనర్ధాలు కలుగుతాయి. మీ కుటుంబసభ్యుల ఆరోగ్యం సమస్యగా మారుతుంది. ఆర్దికంగా బాగానే ఉంటుంది. 

మిధున రాశి : ఇవాళ ప్రతికూల పరిస్థితులుంటాయి. ముఖ్యంగా చాలా విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి. అన్నింటికంటే ప్రధానమైంది ఆర్ధిక పరిస్థితి. ఆర్ధికంగా సమస్యలు తప్పవు. తొందరపడి తీసుకున్న నిర్ణయాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబసభ్యుల్ని మరింత ప్రేమగా చూసుకోవల్సి ఉంటుంది. 

కర్కాటక రాశి : ఈ రాశిలో పుట్టినవారుకి సానుకూలం పరిస్థితులుంటాయి. ముఖ్యంగా విద్యార్ధులకు బాగుంటుంది. ఆర్ధికంగా అంతా కలిసివస్తుంది. జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉండి చికాకు దూరమవుతుంది. తల్లిదండ్రులతో ఎక్కువగా అనుబంధం ఉంటుంది. ఆరోగ్యంగా ఏ విధమైన సమస్యలుండవు.

సింహ రాశి : ఈ రాశివారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్ధికంగా లాభపడతారు. అనుకున్న పనులన్నీ పూర్తయి..సమస్యలన్నీ దూరమవుతాయా.ి ఆరోగ్యపరంగా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇష్టమైన ప్రాంతాలకు వెళ్తారు. వ్యాపారులకు, ఉద్యోగులకు అనుకూలమైన రోజు. 

కన్య రాశి : ఇవాళ ఈ రాశివారికి పూర్తిగా అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్ధికంగా చాలా బాగుంటుంది. మానసిక స్థితి బాగుండటంతో ప్రశాంతత ఉంటుంది. స్నేహితులు, కుటుంబసభ్యులు మద్దతిస్తారు. జీవిత భాగస్వామి కారణంగా అనుకూలమైన మార్పులొస్తాయి. పనిపై పూర్తిగా శ్రద్ధ పెడతారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. 

తుల రాశి : ఈ రాశివారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేయగలరు,. ఆర్ధికంగా ఫరవాలేదు. మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే ఆదాయం బాగానే ఉన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. కుటుంబ జీవితంలో కలహాలు ఉంటాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఇవాళ బాగుంటుంది.  ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్ధికంగా కాస్త ఫరవాలేదు. చేతికి డబ్బు అందుతుంది. ఇంటి వాతావరణం మాత్రం కాస్త చికాకు కల్గిస్తుంది. ఆరోగ్య విషయంలో ఏ విధమైన సమస్యలు ఎదురుకావు. 

ధనస్సు రాశి : ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో ఆనందం, ప్రశాంతత లభిస్తుంది. ఆర్ధికంగా బాగుంటుంది.  ఆరోగ్యపరమైన సమస్యలేవీ తలెత్తవు. వ్యాపారులు కూడా నష్టాల్ని కొంతమేర భర్తీ చేసుకోగలరు. 

మకర రాశి : ఈ రాశిలో పుట్టినవారికి  పరిస్థితులు చాలావరకూ అనుకూలంగానే ఉంటాయి. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్ధికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఫరవాలేదు. ఇంట్లో శుభకార్యాలుంటాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనవసర విషయాల్లో పడితే దాంపత్యజీవితంలో సమస్యలు రావచ్చు. 

కుంభ రాశి : ఈ రాశివారికి పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. రోజూ చేసే పనులతో సమస్యలు ఎదురుకావచ్చు. అదే సమయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధికంగా బాగుంటుంది. పెద్ద పెద్ద అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. 

మీన రాశి : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించకపోతే సమస్యలొస్తాయి. ఆర్ధికంగా ఇబ్బందులు పడవచ్చు. మీకు కలిగే కొత్త పరిచయాల వల్ల రానున్న రోజుల్లో ప్రయోజనం కలుగుతుంది. 

Also read: ఇవాళ్టి మీ రాశిఫలాలు.. నవంబర్ 28న మీ జాతకం ఇలా ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News