Makar Sankranti 2023: రేపటి నుంచి సంక్రాంతి సందడి మెుదలుకానుంది. మన తెలుగు లోగిళ్లలో ఈ పండుగను పెద్ద పండుగ పేరుతో పిలుస్తారు. ఈ ఫెస్టివల్ నాలుగు రోజులపాటు జరుపుకునే పండుగ. ఇందులో మెుదటి రోజు నాడు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగో రోజు ముక్కునుమ జరుపుకుంటారు.
సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు మకరరాశిలో సంచరించనున్నాడు. దీనినే మకర సంక్రాంతి (Makar Sankranti 2023) అంటారు. ఈ రోజున స్నానం మరియు దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున నీటితో కొన్ని చర్యలు చేయడం ద్వారా మీ కీర్తిప్రతిష్టలు పెరగడంతోపాటు అపారమైన ధనాన్ని పొందుతారు.
1. మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్టం పెరగడంతోపాటు జీవితంలో విజయానికి మార్గం తెరుచుకుంటుంది.
2. పొంగల్ నాడు శివలింగానికి నీటిని సమర్పించే ఆచారం కూడా ఉంది. ఈ రోజున శివలింగానికి నీటిని సమర్పించడం వల్ల జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున మెుక్కలకు నీరు పోయడం వల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది.
3. హిందూ మతంలో తులసి మొక్క పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజున తులసి చెట్టుకు నీరు పోయడం వల్ల మీ జీవితంలో సానుకూలత వస్తుంది. అంతేకాకుండా ఈ రోజున అవసరమైన వారికి నీటిని దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
4. సంక్రాంతి నాడు ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత పీపుల్ చెట్టుకు నీరు పోయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.
5. మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా ముఖ్యం. అలా చేయలేని పక్షంలో ఇంట్లో స్నానం చేసే నీటిలో కాస్త గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు. అదే సమయంలో నీళ్లలో బెల్లం, తేనె కలిపి పిల్లలకు తినిపిస్తే కంటిచూపు దరిచేరదని విశ్వాసం.
Also Read: Shani Gochar 2023: మరో 3 రోజుల్లో ఈ రాశులను అదృష్టం వరించనుంది.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి