Guru Shani Gochar: శని, గురు గ్రహలు సంచారంతో డిసెంబర్‌ 31 నుంచి ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు!

Guru Shani Gochar: శని, గురు గ్రహలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.     

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2023, 02:31 PM IST
Guru Shani Gochar: శని, గురు గ్రహలు సంచారంతో డిసెంబర్‌ 31 నుంచి ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు!

 

Guru Shani Gochar: డిసెంబర్‌ 31 తేది తర్వాత రాబోయే కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అందుకే రాబోయే     2024 సంవత్సరం చాలా ప్రత్యేకత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంవత్సరం చివరలోని చివరి రోజు (31 డిసెంబర్) బృహస్పతి రాశి సంచారం చేయబోతోంది. శని గ్రహం తన సొంత రాశి కుంభ రాశిలో తిరోగమన దశలో ఉండగా, బృహస్పతి మేష రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ గ్రహ స్థానాలు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కీలకం. కాబట్టి బృహస్పతి సంచారం చేయడం వల్ల 2024 సంవత్సరంలో కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయి. 

ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు:
మేషరాశి:

బృహస్పతి మేషరాశిలో తిరోగమనం చేయడం వల్ల ఈ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రతి పనిలో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఏదైనా కొత్త పనిని ప్రరంభించాలనుకునేవారికి ఈ సమయం ఏంతో కీలకమైనది. అయితే మేష రాశివారు ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. దీంతో పాటు ఒత్తిడి, మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 

మిథున రాశి:
శని, గురు గ్రహలు ప్రత్యేక స్థానంలో ఉండడం వల్ల మిథున రాశి వారికి ఈ సమయంల చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారం చేసేవారు ఈ సమయంలో భారీ లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభించి ఊహించని లాభాలు పొందుతారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

మకర రాశి:
శని, బృహస్పతి సంచారం మకర రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. దీంతో పాటు ఈ సమయంలో స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్‌ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News