Ganesh Chaturthi: గణేశ్ చతుర్ది..వినాయక చవితి వచ్చేసింది. మరో రెండ్రోజుల్లో అంటే ఆగస్టు 31న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. గణేశ్ చతుర్ధి 3 రాశులపై అత్యంత లాభదాయకం కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
వినాయక చవితి ఆగస్టు 31న ఉంది. దేశవ్యాప్తంగా హిందూవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్న పండుగ ఇది. ఆగస్టు 31వ తేదీ వినాయకుడికి అంకితమైన రోజు కావడంతో అత్యంత మహత్యం, ప్రాదాన్యత కలిగి ఉంటుంది. గణేశుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆ రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే సమయంలో ఈ ఏడాది గణేశ్ చతుర్ధి 3 రాశులకు అత్యంత లాభదాయకం కానుందని..అదృష్టం తిరగరాయనుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అంటే ఆగస్టు 31 ఉదయం నుంచి ఆ మూడు రాశుల జాతకం మారిపోనుంది. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ఏ మూడు రాశులకు లాభదాయకమో తెలుసుకుందాం..
వృశ్చికం
వృశ్చిక రాశి జాతకులకు వినాయకుడు కొత్త ఉద్యోగాలు కల్పించడమే కాకుండా..పదోన్నతి అవకాశాలు కూడా కల్పిస్తున్నాడు. వృశ్చికరాశి జాతకులకు వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా వాణిజ్యపరంగా కొత్త సంబంధాలు ఏర్పర్చుకుంటారు.
తులా రాశి
తులా రాశి జాతకులకు గణేశ్ చతుర్ది నాడు అంటే ఆగస్టు 31 ఉదయం అదృష్టం మారిపోనుంది. వ్యాపారం, కెరీర్‌లో అద్భుత అవకాశాలు, విజయం లభిస్తాయి. వ్యాపారంలో కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. సినిమా, సంగీతం, మీడియా రంగాల్లో ఉండేవారికి అత్యంత అనువైన సమయంగా చెబుతున్నారు. చేపట్టిన ఏ పనిలోనూ ఆటంకం కలగదు.
కర్కాటక రాశి
వినాయకచవితి సందర్భంగా ఆగస్టు 31 నుంచి కర్కాటక రాశి జాతకులకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. డబ్బులు సంపాదించే మార్గాలు తెర్చుకోవడమే కాకుండా..వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఆర్జిస్తారు. వ్యాపారంలో పెద్ద డీల్స్ చేతికి అందుతాయి. ఇక మార్కెటింగ్, న్యాయవాదులు, టీచర్లకు అద్భుతమైన సమయం ప్రారంభం కానుంది.
Also read: Dream Astrology: కలలో వినాయకుడు కనిపిస్తే.. ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook