Sravana Somavaram 2022: ఇవాళే శ్రావణ మాసం మెుదటి సోమవారం.. ముహూర్తం, పూజా విధానం ఇదే..

Sravana Somavaram 2022: శ్రావణ మొదటి సోమవారం నాడు శుభ సమయంలో శివారాధన చేస్తే... శివుడు ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ఈరోజు శుభసమయం, పూజా విధానం గురించి తెలుసుకోండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2022, 10:45 AM IST
Sravana Somavaram 2022: ఇవాళే శ్రావణ మాసం మెుదటి సోమవారం.. ముహూర్తం, పూజా విధానం ఇదే..

First Sravana Somavaram 2022: ఇవాళ అంటే జూలై 18న శ్రావణ మాసం మొదటి సోమవారం. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలు, శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు శివుడికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం చేస్తారు. శ్రావణ సోమవారం (First Sravana Somavaram 2022) రోజున శుభ సమయంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించండి.  

శుభ సమయం
శ్రావణ మాసం మెుదటి సోమవారం నాడు మంచి ముహూర్తంలో పూజ చేయడం ద్వారా శివుడు ప్రసన్నడవుతాడు. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 04:13 నుండి 04:54 వరకు కొనసాగింది. అనంతరం మధ్యాహ్నం 12 నుంచి 12.55 వరకు అభిజీత్ ముహూర్తం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 02.45 నుంచి 03:40 వరకు విజయ్ ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో శివుడిని పూజించడం వల్ల భక్తుల అన్ని కోరికలు నెరవేరుతాయి. 

పూజా విధానం
శ్రావణ సోమవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఈ రోజు ఉపవాసం ఉండి.. ఇంట్లోని సకల దేవతలను పూజించండి. తర్వాత శివునికి జలాభిషేకం చేయండి. శ్రావణ సోమవారం నాడు శివుడికి పంచామృతాన్ని సమర్పించండి. ఈ సమయంలో 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. దీని తరువాత మహాదేవుడికి తెల్లటి చందనం, అక్షింతలు, తెల్లటి పువ్వులు, బిల్వ పత్రాలు, డాతురా, తమలపాకులు మొదలైన వాటిని సమర్పించండి. శమీ ఆకులను నైవేధ్యంగా సమర్పిస్తే.. శని దోషం తొలగిపోతుంది. అనంతరం దేవుడి ముందు పండ్లు, స్వీట్లు సమర్పించండి. పూజ-అభిషేకం తర్వాత శివ చాలీసా చదవండి. శ్రావణ సోమవారం కథను చదవండి లేదా వినండి. చివరికి హారతి ఇచ్చి.. ప్రసాదం పంచండి. 

Also Read: Mahamrityunjay Mantra: మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడంలో ఈ తప్పులు చేయకండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News