Dussehra 2022 Date: సనాతన ధర్మం నుంచి పూర్వీకులు దసరాను ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం దసరాను ఆశ్విజమాసంలోని జరుపుకోవాలని ఒక ఆనవాయితీ అధర్మంపై విజయం సాధించిన గుర్తింపు గాను శుక్లపక్షంలోని పదవ రోజున విజయదశమిని జరుపుకోవడం పూర్వీకుల నుంచే వస్తుంది. ఈసారి దసరా అక్టోబర్ 5 వచ్చింది. ఈ అక్టోబర్ ఐదు విశిష్టత ఏమిటంటే.. ఆరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా అన్ని శుభ ఘడియలేనని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రావణాసురుడి దహనం చేసిన తర్వాత ఆయుధ పూజ గాని.. వాహనాల పూజలు కానీ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
అంతేకాకుండా విజయదశమిని విజయ తిథి కూడా అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఇవే సరైన శాస్త్రం సూచిస్తుంది. ఈ విజయదశమిన 12 గంటలు ఎంతో ప్రాముఖ్యత పొందినవి. ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు.
ముఖ్యంగా అమ్మవారి భక్తులైతే అమ్మవారి అనుగ్రహం పొందడానికి.. ఇంట్లో దుర్గామాత ప్రతిమను పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల అమ్మ అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సుఖశాంతులు కలగడమే కాకుండా సిరి సంపదలు లభిస్తాయి.
దసరా రోజు ఈ దానాలు తప్పకుండా చేయాలి:
విజయదశమి రోజు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పకుండా దానధర్మ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పూర్వీకులు ఇదే సాంప్రదాయంతో దానం చేసేవారని పురాణాలు చెబుతున్నాయి.
అమ్మవారి అనుగ్రహం లభించడానికి వేటిని దానం చేయాలి..?:
>>దసరా రోజున నిరుపేదలకు కొత్త చీపిరిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
>>వీరికి అన్నదానంతో పాటు కొత్త దుస్తులను కూడా దానం చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
>>ఇలా దానం చేసిన తర్వాత అమ్మవారిని స్మరించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొంటే అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
శుభ ఘడియలు:
ఈ సంవత్సరం విజయదశమి దశమి తిథి అక్టోబర్ 4న మధ్యాహ్నం 2: 20 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 5 మధ్యాహ్నం 12 గంటల వరకు ముగుస్తుంది. అయితే భారత్ దేశవ్యాప్తంగా అక్టోబర్ 05న దశమి వేడుకలు జరుపుకుంటారు. అమ్మవారిని పూజించాలి అనుకునేవారు అక్టోబర్ 4 నుంచి 5వ మధ్యాహ్నం వరకు పూజించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి