Mars And Mercury Conjunction: కుజ, బుధ గ్రహాల సంయోగం.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే..

Mars And Mercury Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహం బుధ గ్రహం సంచారం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఈ సమయంలో రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు నెరవేయడమే కాకుండా ఉద్యోగులకు అధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 09:16 AM IST
Mars And Mercury Conjunction: కుజ, బుధ గ్రహాల సంయోగం.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే..

 

Mars And Mercury Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాలు సంచారం చేస్తూ ఒకే గ్రహంలో సంయోగం చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎంతో ముఖ్యమైన గ్రహాలు ఒకే రాశిలో కలవడం కారణంగా అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. జనవరి 28వ తేదీన రాశిలో కుజ గ్రహంతో పాటు బుధ గ్రహం కలువ బోతున్నాయి. ఈ రెండు గ్రహాల సంయోగం జనవరి 28వ తేదీన రాత్రి 8 గంటలకు జరగబోతోంది. ఎంతో ప్రాముఖ్యమైన ఈ గ్రహాల కలయిక కారణంగా రెండు ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో అదృష్టం పెరిగి సంపాదనలో కూడా మార్పులు వస్తాయి. అయితే ఈ రెండు గ్రహాల కలయిక ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
కుజ, బుధ గ్రహాల కలయిక కారణంగా మేష రాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ సమయంలో గణనీయమైన సానుకూల మార్పులతో పాటు విపరీతమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి. దీంతోపాటు మీరు ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఊహించని డబ్బు పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో బాస్ మద్దతు లభించి ఎప్పుడు పొందలేని పేరును పొందుతారు.

కన్యా రాశి:
ఈ సమయంలో కన్యా రాశి వారికి అంగారకుడు అనుగ్రహం లభించి ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఇంతకు ముందున్న మానసిక సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తండ్రి నుంచి సంపాదన కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో జీవితంలో ఆనందం రెట్టింపు అవ్వడమే కాకుండా ఎంతో గౌరవంగా బతకగలుగుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి కూడా మీ కష్టాసుఖాలను పంచుకుంటుంది.

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి అంగారపుడి, బుధుడి కలయిక చాలా శుభ్రమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రెండు గ్రహాల కలయిక వీరికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. దీంతోపాటు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో శుభవార్తలు కూడా వింటారు. అంగారపుడి అనుగ్రహం లభించి వివాహితులు ఎంతో సంతోషంగా ఈ సమయం గడపగలుగుతారు.

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News