Jupiter - Mars Conjunction: జూలై 12న శక్తివంతమైన సంయోగం.. ఈ రాశులవారికి గోల్డెన్‌ డేస్‌ ప్రారంభం!

Jupiter - Mars Conjunction Effect: వృశ్చిక రాశిలో ఎంతో శక్తివంతమైన గురు - కుజుడు కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఈ క్రింది 4 రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోతాయి. ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 11, 2024, 10:12 AM IST
Jupiter - Mars Conjunction: జూలై 12న శక్తివంతమైన సంయోగం.. ఈ రాశులవారికి గోల్డెన్‌ డేస్‌ ప్రారంభం!

Jupiter - Mars Conjunction Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒకే రాశిలో రెండు గ్రహాలు సంచార దశలో ఉన్నప్పుడు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని సార్లు శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడుతాయి. ఈ సంయోగం, యోగాల ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. అయితే ఈ ప్రభావం కొన్ని రాశులవారిపై ప్రత్యేక్షంగా పడితే, మరికొన్ని రాశులవారిపై పరోక్షంగా పడుతుంది. ఇదిలా ఉంటే జూలై 12న వృషభరాశిలో  ఎంతో శక్తివంతమైన గ్రహం పరిగణించే శుక్రుడు సంచారం చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే ఈ రాశిలో బృహస్పతి గ్రహం ఉండడం వల్ల గురు, కుజ గ్రహాల కలయిక ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ శక్తివంతమైన సంయోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈ సంయోగానికి ఎంతో ప్రత్యేకమైన ప్రముఖ్యత కలిగి ఉంటుంది. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.

ఈ సంయోగంతో 4 రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి:

గురు - కుజుడు కలయిక కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా ఫలప్రదంగా ఉంటుంది. గతంలో కంటే ఈ సమయంలో ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరి సక్సెస్‌ రేటు కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. 

కన్య రాశి:
ఈ శక్తివంతమైన గ్రహాల సంయోగం కారణంగా కన్యా రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండా అనుకున్న పనులు వెంటనే జరిగిపోతాయి. అలాగే జీవితంలో ఆనంద కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా విపరీతమైన ధన లాభాలు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కుజుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు ఈ సమయంలో అనుకున్న పనులు పూర్తిగా జరిగిపోతాయి. అంతేకాకుంగా సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితుల్లో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి. దీంతో పాటు సమాజంలో కీర్తి, గౌరవం కూడా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు కష్టమైన పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. 

మీనరాశి: 
మీనరాశి వారికి బృహస్పతి, కుజ గ్రహాల కలయిక కారణంగా అనుకున్న పనులు ఎంతో సులభంగా జరిగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా మానసిక సమస్యల నుంచి ప్రశాంతత కూడా లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News