Dreams Interpretation: నిద్రలో రకరకాల కలలు వస్తుంటాయి. ప్రతి కలకూ ఓ అర్ధముంటుంది. స్వప్నశాస్త్రంలో ఆ వివరాలుంటాయి. మీకు కలలో భార్య లేదా భర్త కన్పిస్తే ఏమౌతుందో తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రం, సంఖ్యాశాస్త్రాల్లాగే స్వప్నశాస్త్రానికి కూడా విశేష ప్రాధాన్యత ఉంది. ఈ శాస్త్రం ప్రకారం ప్రతి కలకూ ఓ అర్ధం ఉంటుంది. మీకు నిద్రలో వచ్చే కలలు
కొన్ని భయపెడతాయి. కొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని అర్ధం కాని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. మీకు కలలో భార్య లేదా భర్త కన్పిస్తే అది దేనికి సంకేతమో అర్ధం కాక..ఆందోళన చెందుతున్నారా..ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కలలనేవి దాదాపు అందరికీ వస్తాయి. రాత్రి నిద్రలో వచ్చే కలల గురించి వివరణ ఉంటుంది. మన మానసిక స్థితికి అద్దం పడతాయి కలలు. రోజంతా ఏం ఆలోచిస్తున్నామో లేదా ఏ విషయం మన మదిలో ఉంటుందో..అదే సాధారణంగా కలల్లో ప్రతిబింబిస్తుంటాయి. కలలకు సంబంధించిన చాలా విషయాల గురించి స్వప్నశాస్త్రంలో ఉంది. స్వప్నశాస్త్రం ప్రకారం మీ కన్పించే ప్రతికలకూ ఏదో ఒక సంకేతముంటుంది.
స్నేహితుడు, బంధువులు కలలో కన్పించడం
కలలో మిత్రుడు ఎవరైనా కన్పిస్తే అది శుభసంకేతంగా భావిస్తారు. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో ఎవరైనా ఫ్రెండ్ కన్పిస్తే..చాలా ఇబ్బందుల అనంతరం మీ జీవితంలో ప్రశాంతత వస్తుందని అర్ధం. అంతేకాకుండా మీ మిత్రుడికి మీ సహాయం ఉందని కూడా అర్ధం. ఒకవేళ ఎవరైనా వ్యక్తి కలలో బంధువులు కన్పిస్తే..మీరు చేపట్టిన పని లేదా ప్రాజెక్టులో అవసరం ఉందని..కొత్త ప్రాజెక్టులు లభిస్తాయని అర్ధం.
కలలో తల్లిదండ్రులు, భార్య, భర్త కన్పించడం
మీ కలలో ఎవరైనా వ్యక్తి తల్లిదండ్రులు కన్పిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం భవిష్యత్‌లో మీరు చేపట్టే పనిలో విజయం లభిస్తుందని..గౌరవ మర్యాదలు లభిస్తాయని అర్ధం.అదే మీకు కలలో భార్యాభర్తలు కన్పించడం వెనుక కూడా విశేషమైన కారణముంది. భర్తకు భార్య, భార్యకు భర్త కలలో కన్పిస్తే..శుభంగా భావిస్తారు. స్వప్నశాస్త్రం ప్రకారం వైవాహికబంధం బలోపేతం కావడం, జీవితంలో ఆనందం ఉంటుందని సంకేతం.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook