Surya Grah Remedies: జాతకంలో సూర్యుడు బలపడాలంటే... ఆదివారం ఇలా చేయండి!

Surya Grah Remedies: సూర్యుడు... కీర్తి, బలం, గౌరవానికి కారకుడు. జాతకంలో సూర్య దోషం ఉంటే... ఆ వ్యక్తి అనేక కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో, సూర్య గ్రహాన్ని బలోపేతం చేయడానికి కొన్ని నివారణలు చెప్పబడ్డాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2022, 08:42 AM IST
Surya Grah Remedies: జాతకంలో సూర్యుడు బలపడాలంటే... ఆదివారం ఇలా చేయండి!

Surya Grah Remedies:  ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. సూర్యభగవానుడు..కీర్తి, బలం, గౌరవానికి కారకుడు. జాతకంలో సూర్యుడు (Surya Grah) బలంగా ఉంటే ఆ వ్యక్తి లైఫ్ బిందాస్ గా ఉంటుంది. ఒక వేళ జాతకంలో సూర్యదోషం ఉంటే... ఆ వ్యక్తి అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఏదీ అతడికి సులువుగా లభించదు. బాగా కష్టపడాల్సి ఉంటుంది. సూర్యగ్రహాన్ని బలోపేతం చేయడానికి జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి.  

సూర్యుడు బలహీనంగా ఉంటే..
కుండలిలో సూర్యుడి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తిని కష్టాలు చుట్టిముడతాయి. అనారోగ్యం బారిన పడతారు. తీవ్ర ఒత్తిడికి గురవుతాడు. ఏ పనిలోనూ విజయం సాధించలేడు. వ్యాపారంలో భారీగా నష్టాలను చవిచూస్తాడు. కుటుంబంలో కలహాలు వస్తాయి. 

సూర్య గ్రహాన్ని బలోపేతం చేసే మార్గాలు..
>> జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, సూర్య గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఒక కుండలో శుభ్రమైన నీటిని తీసుకొని ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి  అర్ఘ్యం ఇవ్వండి. అంతేకాకుండా చందనం, ఎర్రటి పువ్వులు, అక్షత మరియు దుర్వాలను సమర్పించండి. అదే సమయంలో ''ఓం హ్ర్ హ్ర్ సః సూర్యాయ నమః । ఓహ్ ద్వేషం: సూర్య ఆదివ్యోం. శత్రు నాశాయ ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః ।'' అనే మంత్రాన్ని జపించండి. 
>> ఆదివారం ఉపవాసం ఉండటం వల్ల సూర్యుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. జాతకంలో సూర్యగ్రహం బలహీనంగా ఉంటే ఎరుపు, పసుపు బట్టలు, బెల్లం, బంగారం, గోధుమలు, ఎర్ర కమలం, పప్పు మొదలైనవి దానం చేయాలి. 
>>  సూర్య గ్రహం ప్రశాంతంగా ఉండటానికి రూబీ స్టోన్ ధరించడం శుభప్రదంగా భావిస్తారు. 

Also Read: Vastu Tips: షమీ మొక్కతో ఇంట్లో అంతా అదృష్టమే..వాస్తుదోషాల్నించి విముక్తి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News