Hibiscus plants: ఇంట్లో మొక్కలకు వాస్తు ఉంటుందా..మందార మొక్కల్ని ఏ దిశలో పెంచాలి

Hibiscus plants: మొక్కల్ని దిశ ప్రకారం పెంచాలా..ఆశ్చర్యంగా ఉన్నా కొంతమంది తప్పక పాటిస్తుంటారు. పాటిస్తే మంచిదని జ్యోతిష పండితులు చెబుతుంటారు. మొక్కల పెంపకానికి, దిశలకు సంబంధమేంటో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2022, 07:08 AM IST
  • ఇంట్లో మొక్కలకు వాస్తు ఉంటుందా..వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది
  • ఏ మొక్కల్ని ఏ దిశలో ఉంచితే మంచిది, లేకపోతే ఏం జరుగుతుంది
  • మందార మొక్కల్ని తూర్పు లేదా ఉత్తర దిశల్లోనే పెంచాలంటున్న వాస్తుశాస్త్రం
Hibiscus plants: ఇంట్లో మొక్కలకు వాస్తు ఉంటుందా..మందార మొక్కల్ని ఏ దిశలో పెంచాలి

Hibiscus plants: మొక్కల్ని దిశ ప్రకారం పెంచాలా..ఆశ్చర్యంగా ఉన్నా కొంతమంది తప్పక పాటిస్తుంటారు. పాటిస్తే మంచిదని జ్యోతిష పండితులు చెబుతుంటారు. మొక్కల పెంపకానికి, దిశలకు సంబంధమేంటో తెలుసుకుందాం..

ప్లాంటేషన్..ఇంట్లో అందంగా వివిధ రకాల మొక్కలు పెంచడం అందరికీ ఇష్టమే. పూల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు లేదా ఇంటికి అందాన్నిచ్చే మొక్కలు, సెంటిమెంట్ ప్రకారం మనీప్లాంట్ మొక్కలు..ఇలా ఎవరిష్టం వారిది. అయితే తులసి, మనీప్లాంట్, మందార ఇలా చాలా రకాల మొక్కలకు వాస్తుశాస్త్రంలో ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. మీ ఇంట్లో పెంచుకునే కొన్ని రకాల మొక్కలను ఏ దిశలో ఉంచితే మంచి జరుగుతుందో వాస్తుశాస్త్రం చెబుతోంది. నమ్మకమనేది ఉంటే అన్నీ నమ్మకాలే అవుతాయి. ఏ మొక్కలు దేనికి సంకేతమో కూడా చెబుతోంది. 

మందారపూల ప్రాముఖ్యత, ఏ దిశలో

ముఖ్యంగా మందారపూలు. వాస్తుశాస్త్రంలో ప్రాధాన్యత ఉన్న మొక్క. పూజకు తప్పనిసరిగా ఉపయోగించేది కావడం, వినాయకుని పూజకు ప్రాముఖ్యత సంతరించుకునేది కావడం మరో కారణం. అందుకే ఇంట్లో ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో మందార మొక్కను నాటమని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే ఇంట్లో ఆహారసమస్య తలెత్తదట. కుటుంబ వాతావరణం బాగుంటుందట.

అదే విధంగా సూర్యకాంతి ప్రసరణ కోసం ఇంటి కిటికీ వద్ద మందార మొక్కల్ని పెంచవచ్చు. ఎర్రటి మందారపూలు ఇంటికి అందాన్ని తెస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ముఖానికి లేదా జుట్టు బలానికి ఔషధంగా మందారపూలను వాడుతారు. మందారపూవుని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ పూజల్లో క్రమం తప్పకుండా వినియోగిస్తారు. ఎర్రటి మందారపూవుని ప్రతిరోజూ హనుమంతుడికి సమర్పించడం వ్లల మంచి జరుగుతుందనేది ఓ నమ్మకం.

మందార మొక్కలు ప్రతి ఇంట్లో ఉండటమే కాకుండా, వాస్తుశాస్త్రం సూచించిన తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఉంచడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉండదు. సంపద నిలుస్తుంది. అశాంతి ఉండదనేది వాస్తు నిపుణుల మాట.

Also read: Good Luck Tips: ఉదయాన్నే చేసే ఈ 7 పనులు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News