Devaguru Brihaspati Transit in Aries: దేవతలు గురువు బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత గురుడు ఈ రాశిలో గోచరిస్తున్నాడు. బృహస్పతి మేషరాశిలో సంచరించడం వల్ల వ్యతిరేక రాజయోగం ఏర్పడింది. ఈ యోగం రెండు రాశుల వారికి శుభప్రదం కానుంది. ఆ రెండు రాశులు ఏవో తెలుసుకుందాం.
వ్యతిరేక రాజయోగం ఎలా ఏర్పడుతుంది?
ఆస్ట్రాలజీ ప్రకారం, బృహస్పతి మేషరాశిలో తొమ్మిదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి మరియు అదృష్ట ఇంట్లోకి ప్రవేశించాడు. రాశిచక్రంలో 6వ, 8వ మరియు 12వ గృహాల అధిపతులు కూటమిగా ఏర్పడినప్పుడు వ్యతిరేక యోగం ఏర్పడుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో తొమ్మిదవ ఇంటికి మరియు ఆరవ ఇంటికి బృహస్పతి అధిపతి. బృహస్పతి ఈ రాశిచక్రంలోని పదవ ఇంట్లో సంచరించాడు. వ్యతిరేక రాజయోగం వీరికి జాబ్ ఇస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
Also Read: Weekly Horoscope: ఈ వారం అదృష్ట రాశులు ఇవే.. వీరికి ఊహించనతం డబ్బు, జాబ్ ప్రమోషన్..
మిధునరాశి
బృహస్పతి ఈ రాశిచక్రం యొక్క లగ్న గృహంలో సంచరించాడు. ఈ యోగం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు పరీక్షలు-ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.
Also Read: Mercury Set 2023: జూన్ 19న బుధుడి అస్తమయం.. 23 రోజులపాటు ఈరాశులకు నరకమే నరకం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి