March Rasi phalalu: మార్చి 30 వరకు ఈ 3 రాశులవారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది.. మీ రాశి ఉందా?

Planet Conjunction in March 2024: ఇటీవల కుంభరాశిలో మూడు గ్రహాల అద్భుత కలయిక జరిగింది. దీంతో మూడు రాశులవారు మార్చి 30 వరకు వారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 21, 2024, 09:29 PM IST
March Rasi phalalu: మార్చి 30 వరకు ఈ 3 రాశులవారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది.. మీ రాశి ఉందా?

Shukra Shani Mangal yuti in March 2024: గ్రహాల కదలిక మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మన జాతకంలో గ్రహాల స్థానాలను బట్టే భవిష్యత్తును కూడా చెబుతారు. రీసెంట్ గా కుంభరాశిలో కుజుడు, శని, శుక్రుడు కలయిక సంభవించింది. వీరి సంయోగం మార్చి 30 వరకు కొనసాగుతోంది. ఈ మూడు గ్రహాల మైత్రి మెుత్తం 12 రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడు, కుజుడు, శని గ్రహాల కలయిక ముఖ్యంగా మూడు రాశులవారికి అనుకూలంగా ఉండనుంది. ఈ నెల ఆఖరి వరకు ఈ రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందుతారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మకర రాశి: కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక మకరరాశి వారికి చాలా మేలు చేస్తుంది. వీరి అవసరాలన్నీ తీరిపోతాయి. పెళ్లి కుదురుతుంది. ఆరోగ్య సమస్యల దూరమవుతాయి. మీ దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి. మీకు సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. దైవభక్తి పెరుగుతుంది. 
వృషభం: ఈ సమయంలో వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ వ్యాపారం ప్రారంభించిన భారీగా లాభాలు వస్తాయి. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. మీకు సంతానసుఖం కలుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కెరీర్ ఇంకముందు కంటే అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతోంది. 

Also Read: April Rasi Phalalu 2024: మరో 10 రోజుల తర్వాత ధనవంతులు కాబోతున్న రాశులివే..!

మేషం: కుజుడు, శుక్రుడు, శని గ్రహాల సంయోగం మేషరాశి వారికి ఎన్నడూ చూడని లాభాలను ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ కెరీర్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మీ వ్యాపారం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనికి ఫ్యామిలీ అండ్ ప్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chandra Grahan 2024: తొలి చంద్రగ్రహణం రాబోతుంది.. ఈ 3 రాశులకు అదృష్టాన్ని ఇస్తుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News