Budhaditya Raja Yoga: అక్టోబర్ రెండో వారంలో అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి అఖండ ధనయోగమే.!

Budhaditya Raja Yoga: అక్టోబర్ రెండవ వారం ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రాజయోగంతో ప్రభావితం అయ్యే రాశులేవువో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 13, 2024, 10:34 AM IST
Budhaditya Raja Yoga: అక్టోబర్ రెండో వారంలో అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి అఖండ ధనయోగమే.!

Budhaditya Raja Yoga In Telugu: అక్టోబర్ రెండవ వారం బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో సూర్యుడు తులా రాశిలో ప్రవేశించబోతున్నాడు. అయితే ఇప్పటికే అదే రాశిలో బుద్ధుడు ఉండడం కారణంగా సూర్యుడు బుధుడి కలయిక జరగబోతోంది. దీని కారణంగానే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే అక్టోబర్ రెండో వారంలో ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా జీవితంలో పురోగతి లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. యోగ ప్రభావం వ్యాపారాలు చేసే వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతే కాకుండా అదృష్టాన్ని కూడా తెచ్చిపెడు తుంది జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ వారం ఉద్యోగాలు చేసే వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ వారం అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి: 
మేష రాశి వారికి ఈ వారం అద్భుతమైన శక్తి లభిస్తుంది. దీని కారణంగా వీరు సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అంతే కాకుండా విజ్ఞతతో అన్ని రకాల సమస్యలనుంచి ఉపశమనం పొందే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎంతో తొందరగా పూర్తి అవుతాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి డబ్బు సంబంధిత కొన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. దీంతోపాటు ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. అలాగే వైవాహిక జీవితం కూడా ఎంతో మధురంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు జీవిత భాగస్వామి సపోర్టు కూడా లభించి ఆర్థిక సంబంధాల విషయాల్లో చాలావరకు మెరుగు పొందుతారు. దీంతోపాటు మానసిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు యోగాతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇక మతపరమైన అంశాలపై కూడా ఈ సమయం కాస్త ఆసక్తి పెరుగుతుంది.

మిథున రాశి:

మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీంతో వీరికి పెండింగ్ లో ఉన్న ప్రతి పనులు సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే ఈ రాశి వారికి అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేసే వారికి సీనియర్ల సపోర్టు లభించి మంచి ఆహ్లాదకరమైన వర్క్ ప్లేస్ అనుభవిస్తారు. అలాగే విద్యార్థులు ఈ సమయంలో బిజీ బిజీగా ఉంటారు. ఎందుకంటే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా దీని కారణంగా కాస్త బిజీగా అవుతారు. ఇక ఈ సమయంలో స్నేహితుల సపోర్ట్ కూడా లభిస్తుంది. దీనికి కారణంగా వీరు మంచి ఆలోచనలతో నిండి ఉంటారు. అలాగే ఈ సమయంలో మిథున రాశి వారు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. దీని కారణంగా అద్భుతమైన జీవితాన్ని పొందగలుగుతారు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృశ్చిక రాశి:

అక్టోబర్ రెండవ వారం వృశ్చిక రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. వీళ్ళు ఈ సమయంలో రిలాక్స్ మైండ్‌తో కొత్త కొత్త ఆలోచనలు పొందుతారు. అలాగే స్నేహితులు శ్రేయోభిలాషుల సహకారం లభించి అద్భుతమైన లాభాలు పొందుతారు. దీంతోపాటు పనులన్నీ సులభంగా చేయడమే కాకుండా సీనియర్ల మద్దతు పొంది. కొన్ని కొత్త పనులు కూడా నేర్చుకోగలుగుతారు. కుటుంబం లేదా ఇతర విషయాలపై కూడా వీరికి ఆసక్తి పెరుగుతుంది. అలాగే వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసి విహారయాత్రలకు కూడా వెళ్తారు. దీని కారణంగా మనస్సు ఎంతో ఆహ్లాద ఫలితంగా మారుతుంది. అలాగే భాగస్వామ్య జీవితం కూడా ఎంతో శుభప్రదంగా మారుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News