Budhaditya Raj Yog December: వృశ్చికరాశిలో బుధుడు & సూర్యుడి కలయిక.. డిసెంబర్ 03 వరుకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు

Budhaditya Raj Yog In Vrachika 2022: వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, డిసెంబర్ 03 వరకు వృశ్చికరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. వారెవరంటే.. ?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 11:18 AM IST
  • వృశ్చికరాశిలో బుధుడు, సూర్యుడి కలయిక
  • ఈ మూడు రాశులకు లాభమే ఇక
  • ఇందులో మీ రాశి కూడా ఉందా..??
Budhaditya Raj Yog December: వృశ్చికరాశిలో బుధుడు & సూర్యుడి కలయిక.. డిసెంబర్ 03 వరుకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు

Budhaditya Raj Yog In Scorpio December 2022: జ్యోతిషశాస్త్రంలో బుధాదిత్య రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వృశ్చికరాశిలో బుధుడు మరియు సూర్యుడి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈయోగం డిసెంబరు 3 వరకు ఉంటుంది. వృశ్చికరాశిలో ఏర్పడిన ఈ బుధాదిత్య రాజయోగం వల్ల మూడు రాశులవారు వ్యాపారంలో భారీ లాభాలను, వృత్తిలో పురోగతిని సాధిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మకరం (Capricorn): బుధాదిత్య రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయంలో రెట్టింపు లాభం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఇదే మంచి సమయం. రాజకీయాల్లో ఉండేవారు ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీ మనోబలం పెరుగుతుంది. మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా పాత పెట్టుబడి నుండి లాభం పొందుతారు. స్టాక్ మార్కెట్ నుండి లాభం పొందుతారు. 

కర్కాటకం (cancer): ఈ రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. పెళ్లికాని యువతీయవకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీకు స్నేహితులు మరియు బంధువుల సపోర్టు లభిస్తుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. మీరు ఏదైనా అవార్డును సాధించే అవకాశం ఉంది. సమాజంలో మీకు ఆదరణ పెరుగుతుంది. 

తుల (Libra): బుధాదిత్య రాజయోగం మీకు ఆర్థికంగా మేలు చేస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కెరీర్ లో పురోగతికి గొప్ప అవకాశాలను పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కల నెరవేరుతుంది. ఎవరి వద్దనైనా మీ డబ్బు ఉండపోతే తిరిగి పొందుతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది. 

Also Read: Astrology: ధనుస్సు రాశిలో సూర్య, శుక్రుల కలయిక... ఈ 4 రాశులకు అదృష్ట యోగం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News